Godavari Floods Live: వారం రోజులు కుండపోతగా కురిసిన వర్షాలతో తెలంగాణలో అపార నష్టం జరిగింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో వరదలు బీభత్సం స్పష్టించాయి. వందలాది గ్రామాలు నీట మునిగాయి. వర్షాలు తగ్గి మూడు రోజులైనా వరద మాత్రం తగ్గలేదు. ఇంకా పలు గ్రామాలు జల దిగ్భంధంలోనే ఉన్నాయి. వేలాది ఎకరాలు నీట మునిగాయి. వరదలతో తమకు తీరని నష్టం జరిగిందనే రైతులు కలవరపడుతున్నారు. గవర్నర్ తమిళిసై , సీఎం కేసీఆర్ వేరువేరుగా వరద ప్రాంతాల్లో పర్యటించారు. గవర్నర్ భద్రాచలంలో నేరుగా వరద బాధితులను కలుసుకుని సమస్యలు తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ వరద ప్రాంతాల్లో పర్యటనలకు సంబంధించి అప్ డేట్స్ మినిట్ టు మినిట్...