Telangana Election 2023 LIVE Updates in Telugu: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో గురువారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది అన్ని పోలింగ్ స్టేషన్లకు చేరుకుని ఏర్పాట్లు పూర్తిచేశారు. 2,290 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. 3.26 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటు శాతం పెంచే ఉద్దేశంతో ఇప్పటికే అన్ని సంస్థలకు సెలవు ప్రకటించారు. సాయంత్రం 5 గంటలకు వరకు క్యూలో నిల్చున్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. బరిలో నిల్చున్న అభ్యర్థులు ఓటరు తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 3న తెలంగాణతోపాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. రాష్ట్రంలో పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. దాదాపు 75 వేల మంది పోలీసు బలగాలను ఎన్నికల పోలింగ్‌లో పాల్గొంటున్నారు. ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి..