KTR Challenge: నిమజ్జనం సాక్షిగా రాజీవ్‌ విగ్రహం తొలగిస్తాం: కేటీఆర్‌ సంచలన ప్రకటన

KTR Perform Palabhishekam To Telangana Talli Statue: రాజీవ్‌ గాంధీ విగ్రహం తప్పక తొలగిస్తామని.. తమను ఎవరూ ఆపలేరని కేటీఆర్‌ సంచలన ప్రకటన చేశారు. గణేశ్‌ నిమజ్జనం సాక్షిగా రేవంత్‌ రెడ్డికి సవాల్ విసిరారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Sep 17, 2024, 11:46 AM IST
KTR Challenge: నిమజ్జనం సాక్షిగా రాజీవ్‌ విగ్రహం తొలగిస్తాం: కేటీఆర్‌ సంచలన ప్రకటన

KTR Perform Palabhishekam: తెలంగాణ సచివాలయం ముందు ఏర్పాటుచేసిన వివాదాస్పద రాజీవ్‌ గాంధీ విగ్రహంపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డికి సవాల్‌ విసిరారు. 'గణేశ్‌ నిమజ్జనం సాక్షిగా రాజీవ్‌ గాంధీ విగ్రహం తొలగిస్తాం' అని కేటీఆర్‌ ప్రకటించిన సంచలనం రేపారు. రేవంత్‌ ప్రభుత్వ తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Balapur Laddu: బాలాపూర్‌ లడ్డూ గెలిస్తే కొంగు బంగారమే! వేలం విజేతల జాబితా ఇదే!

సెప్టెంబర్‌ 17వ తేదీని బీఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ సమైక్యతా దినోత్సవంగా పరిగణించి సంబరాలు నిర్వహించింది. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌ వద్ద కేటీఆర్‌ జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం పార్టీ కార్యాలయ ఆవరణలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ట్యాంక్‌బండ్‌లో రాజీవ్‌ గాంధీ విగ్రహావిష్కరణకు నిరసనగా తెలంగాణ తల్లికి పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాలతో అభిషేకించారు.

Also Read: Balapur Laddu: వేలంలో పాల్గొనేవారికి భారీ షాక్‌.. బాలాపూర్‌ లడ్డూ ...

 

అనంతరం జరిగిన సమావేశంలో కేటీఆర్‌ కీలక ప్రసంగం చేశారు. 'మేం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తాం. సకల మర్యాదలతో అక్కడి నుంచి రాజీవ్‌ విగ్రహం తొలగించి ఆ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టిస్తాం' అని ప్రకటించారు. ఈ సందర్భంగా రేవంత్‌ కంప్యూటర్‌ కనిపెట్టిన వారిపై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. రేవంత్‌ రెడ్డికి తెలివి లేదని విమర్శించారు. 'చార్లెస్‌ బాబేజ్‌ కంప్యూటర్‌ను కనిపెట్టారు. భారతదేశంలోకి 1950 కాలంలోనే టాటా గ్రూప్‌ కంప్యూటర్‌ను పరిచయం చేసింది. ఈ విషయాలు తెలియని రేవంత్‌ రెడ్డి నోరు ఉంది కదా అని అరుసుకుంటూ వెళ్తున్నాడు' అని మండిపడ్డారు.

వెంటనే ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం రూ.15 వేలు ఇచ్చి చూపించాలని సవాల్‌ విసిరారు. పింఛన్ల పెంపు రూ.4 వేలు ఇవ్వాలని కోరారు. యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని? ఏడాది ముగుస్తున్నా 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఎప్పుడు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని ఆందోళ వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్రం సమస్యలు పరిష్కరించి సక్రమంగా పరిపాలన చేయాలని రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ హితవు పలికారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

 

Trending News