న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎన్ని ఉన్నప్పటికీ వాటి ఆచరణ రాష్ట్రాల్లోనే ఉన్నదని, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల అమలును సైతం రాష్ట్ర ప్రభుత్వాలే చేయాల్సి ఉంటుందని, ఢిల్లీలో టైమ్స్ నౌ యాక్షన్ ప్లాన్ ట్వంటీ-2020 సమ్మిట్ లో "దేశ నిర్మాణంలో రాష్ట్రాల పాత్ర" అనే అంశంపై జరిగిన చర్చా గోష్టిలో మాట్లాడుతూ.. మేకిన్ ఇండియా లాంటి కార్యక్రమాల్లోనూ రాష్ట్రాల అనుమతులు, రాష్ట్ర ప్రభుత్వ శాఖల సహకారం వంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణలో కీలకంగా ఉంటుందని ఆయన అన్నారు.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు తన సొంత నిధులు ఇస్తున్నామన్న ఆలోచన మంచిది కాదని, రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి నిధులు సమకూరుస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల 72 వేల కోట్ల రూపాయలు కేంద్రానికి పన్నుల రూపంలో ఇస్తే తిరిగి రాష్ట్రానికి కేంద్రం లక్షా 12 వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని గుర్తుచేశారు. తెలంగాణ లాంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు కేంద్రానికి చెల్లిస్తున్న పన్నులతో పోల్చుకుంటే, కేంద్రం అంతే నిధులను రాష్ట్రాలకు తిరిగి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను శత్రువులుగా భావించడం లేదని, కేవలం రాజకీయ ప్రత్యర్థులుగా మాత్రమే భావించి ఎన్నికల్లో పోరాటం చేస్తామని, అలాంటి పార్టీలతో వ్యక్తిగత శత్రుత్వం లేదన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యలను అంశాల వారీగా మద్దతిచ్చినప్పటికీ, ప్రజా వ్యతిరేకమైన అసంబద్ధమైన చర్యలను అదేవిధంగా వ్యతిరేకించామని అన్నారు. గత ఎన్నికల్లోనూ ప్రాంతీయ పార్టీలే బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతూ వస్తున్నాయని, ఇకపై భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రత్యామ్నాయ కూటమికి అవకాశాలు ఏర్పడుతున్నాయని జోస్యం చెప్పారు.
IT and Industries Minister @KTRTRS shared his thoughts at an insightful discussion on ‘Role of States in Building India’ at #TimesNowSummit India Action Plan 2020 in New Delhi. @TimesNow pic.twitter.com/QKtkxVbrHo
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 13, 2020
రెండు జాతీయ పార్టీలు దేశాన్ని ఇప్పటికే నిరాశ పరిచాయని, ఆర్థిక అభివృద్ధి, మౌలిక వసతుల సదుపాయాల కల్పన, సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన వంటి అంశాల్లో దేశ ప్రజల ఆకాంక్షలను అందుకోలేక పోయాయని ఆయన వాపోయారు. ఈ విషయాన్ని దేశ ప్రజలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారని అన్నారు. సీఏఏ 2019 బిల్లును పార్లమెంట్ లో తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిందని, కోపరేటివ్ ఫెడరలిజం, టీమ్ ఇండియా వంటి మాటలు చెప్పే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆ భావనల స్ఫూర్తి ఆధారంగా పని చేయాలని కోరుకుంటున్నామని అన్నారు.
మెర్స ర్ అనే సంస్థ గత ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్ నగరాన్ని, జీవన ప్రమాణాలు వంటి అంశాలతో కూడిన అత్యుత్తమ నగరాల్లో అగ్ర స్థానం కల్పిస్తూ వస్తుందని మంత్రి అన్నారు. భారతదేశాన్ని రెండవ జాతీయ రాజధానిగా ప్రకటించాల్సి వస్తే, హైదరాబాద్ ప్రజలు అంగీకరిస్తారో లేదో అనే విషయంలో నాకు అనుమానం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు, ఎఫ్ఆర్బీఎం పరిమితులు వంటి అంశాల్లో మరింత లిబరల్ గా ఉండాల్సిన అవసరం ఉందని, అప్పుడే దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..