KTR Khamma Tour: తెలంగాణ రాష్ర్ట సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఇవాళ ఖమ్మం నగరంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో కేటీఆర్ టీమ్‌కు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జలక్ ఇచ్చారు. ఎల్‌ఆర్ఎస్ రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తూ కేటీఆర్ మిత్ర బృందం ముందు ప్లకార్డులు ప్రదర్శించారు.
Also Read | Farm Bills 2020: కేంద్ర వ్యవసాయ చట్టం, అపోహలు- వాస్తవాలు
ఎల్ఆర్ఎస్ (LRS) వద్దు.. టీఆర్ఎస్ వద్దూ అంటూ నినాదాలు చేశారు. దీంతో కేటీఆర్ మిత్ర బృందం షాక్ అయింది. దీంతో కేటీఆర్ పర్యటన కాస్త ఆలస్యం అయింది.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు భాజపా కార్యకర్తలను అరెస్ట్ చేసి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఐటీ టరవ్ ప్రారంభోత్సవం కోసం ఇవాళ ఖమ్మం వెళ్లిన కేటీఆర్
పలు అభివృధ్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Also Read | ఈ కొత్త ATM,Banking రూల్స్ తెలియపోతే ఇబ్బంది పడతారు వెంటనే చదవండి
స్థానికంగా రఘునాథపాలెంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన కేటీఆర్ (KTR) రేపటి భారత్ బంద్‌లో రాష్ట్ర రైతులు పాల్గొనాలి అని తెలంగాణ రైతులను కోరారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఆందోళ చేస్తున్నారు. అందులో భాగంగా డిసెంబర్ 8న భారత్ బంద్ ప్రకటించారు. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe