KTR VS REVANTH: సాగర హారంపై సమరం.. కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య ట్విట్టర్ వార్

KTR VS REVANTH:  తెలంగాణ ఉద్యమంలో సాగర హారానికి ప్రత్యేక స్థానం ఉంది. జేఏసీ పిలుపు మేరకు ప్రభుత్వ ఆంక్షలు, పోలీసుల నిర్బంధాలను లెక్క చేయకుండా వేలాది మంది తెలంగాణ ప్రజలు నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన సాగర హారానికి తరలివచ్చారు.

Written by - Srisailam | Last Updated : Sep 30, 2022, 03:45 PM IST
  • సాగరహారానికి పదేళ్లు
  • రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన కేటీఆర్
  • చీమలు పెట్టిన పుట్టలో పాములంటూ కౌంటర్
KTR VS REVANTH: సాగర హారంపై సమరం.. కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య ట్విట్టర్ వార్

KTR VS REVANTH:  తెలంగాణ ఉద్యమంలో సాగర హారానికి ప్రత్యేక స్థానం ఉంది. జేఏసీ పిలుపు మేరకు ప్రభుత్వ ఆంక్షలు, పోలీసుల నిర్బంధాలను లెక్క చేయకుండా వేలాది మంది తెలంగాణ ప్రజలు నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన సాగర హారానికి తరలివచ్చారు. ప్రత్యేక రాష్ట్రం కోసం నినదించారు. సాగరహారం ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ఘట్టంలో మైలురాయిగా నిలిచిపోయింది. సాగరహారం జరిగింది 2012 సెప్టెంబర్ 30. అంటే 2022, సెప్టెంబర్ 30 గురువారానికి 10 ఏళ్లు. సాగరహారానికి పదేళ్లైన సందర్భంగా ఆనాటి ఘటనపై మంత్రి కేటీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య ట్విట్టర్ వార్ జరిగింది.

సాగరహారానికి పదేళ్లు అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో పతాక స్థాయికి తీసుకెళ్లిన సందర్భం.. లక్షల గొంతుకలు 'జై తెలంగాణ' అని నినదించిన రోజు.ప్రతిరోజు పనికిమాలిన విమర్శలు చేసే ప్రతిపక్ష రేవంత్, బండి సంజయ్, ప్రవీణ్ కుమార్, షర్మిల తెలంగాణ ఉద్యమంలో మీ జాడ ఎక్కడ? అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. సాగరహారానికి సంబంధించిన ఆనాటి ఫోటోలను తన ట్వీట్ కు జత చేశారు కేటీఆర్.

సాగరహారంపై మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ పై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చారు. చీమలు పెట్టిన పుట్టలో కల్వకుంట్ల పాములు చేరాయని కౌంటరిచ్చారు. తెలంగాణ ఉద్యమం సకల జనులదని.. సాగర్ హారం ఆ జనుల తరఫున ప్రాతినిధ్యం వహించిన జేఏసీ ఆధ్వర్యంలో జరిగిందని రేవంత్ చెప్పారు. నాడు ఉద్యమం‌పై.. నేడు రాష్ట్రంపై పడి బతకడం మీకు అలవాటైపోయిందని ఘాటుగా బదులిచ్చారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల పోరాటానికి సంబంధించిన వార్త క్లిప్ ను షేర్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజున టీడీపీ, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు దూసుకెళ్లి, గవర్నర్ పై దాడి చేశారు. గవర్నర్ వద్ద నుంచి కాగితాలు లాక్కోవడమే కాకుండా వారికి ఇచ్చిన స్పీచ్ కాపీలను చించి విసిరారు అన్నది ఆ క్లిప్ సారాంశం.

Read also: BIG BOSS : బిగ్ బాస్ షో నిలిచిపోనుందా? అశ్లీలతపై ఏపీ హైకోర్టు సీరియస్..

Read also: Mohammed Siraj: అంతలోనే ఎంతపనాయె.. మహ్మద్ సిరాజ్‌ ఆశలు గల్లంతు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News