/telugu/photo-gallery/after-world-cup-clinches-india-team-how-celebrated-looks-here-and-virat-kohli-rohith-sharma-also-rv-146014 World Cup India: ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా World Cup India: ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా 146014

KT Rama Rao: తెలంగాణలో బొగ్గు గనుల వేలం తీవ్ర రాజకీయ వివాదానికి దారి తీసింది. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో బొగ్గు గనుల వేలం నిర్వహిస్తుండడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం వేలంలో పాల్గొంటుండడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. తెలంగాణకు రక్షణగా నిలవాల్సిన వాళ్లు వేలంలో పాల్గొనడం ఏమిటని నిలదీశారు. కాంగ్రెస్‌, బీజేపీ కలిసి సింగరేణిని ముంచే కుట్ర పన్నుతున్నాయని మండిపడ్డారు. ఈ సందర్భంగా వేలంలో పాల్గొనే వారికి కేటీఆర్‌ హెచ్చరిక జారీ చేశారు. 2028లో వచ్చేది మేమే అప్పుడు గనుల లీజ్‌ రద్దు చేస్తామని సంచలన ప్రకటన చేశారు.

Also Read: Election Result 2024 Congress Analysis: లోక్ సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ పోస్ట్ మార్టమ్.. ఆ 5 రాష్ట్రాల్లో ఓటమిపై సమీక్ష..

హైదరాబాద్‌లో శుక్రవారం బొగ్గుల గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి ఆధ్వర్యంలో బొగ్గు గనుల వేలం నిర్వహించనున్నారు. సింగరేణిని దెబ్బతీసేలా కిషన్‌ రెడ్డి ముందుకు వెళ్తుండగా బీఆర్‌ఎస్‌ పార్టీ తప్పుబట్టింది. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో గురువారం కేటీఆర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా వేలం నిర్వహించడాన్ని తప్పుబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ గనుల వేలాన్ని అడ్డుకున్నారని.. ఎప్పటికైనా తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అని స్పష్టం చేశారు.

Also Read: KarimNagar: అచ్చం మోదీలా బండి సంజయ్.. తొలిసారిగా కేంద్ర మంత్రి ఏం చేశారో చూశారా?

'బీఆర్ఎస్ పార్టీకి 16 పార్లమెంట్ సీట్లు ఇస్తే కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తామని చెప్పాం. ఏపీలో టీడీపీకి 16 పార్లమెంట్ సీట్లు వస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు 16 ఎంపీ సీట్లు ఇస్తే హైదరాబాద్‌లోనే బొగ్గు గనులను కిషన్ రెడ్డి వేలం వేస్తున్నారు. బొగ్గు గనులను ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నరేంద్ర మోదీకి లేఖ రాశారు. మూడు రోజుల తర్వాత రేవంత్ రెడ్డి కూడా రాశారు. కానీ ఇప్పుడు వేలంలో రేవంత్‌ ప్రభుత్వం పాల్గొనడం ఏమిటి?' అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

'సింగరేణి సంస్ధను విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోంది. సింగరేణి సంస్థను బొగ్గు గనుల వేలంలో పాల్గొనాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నారు. వేలంలో పాల్గొంటామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. సింగరేణిని కాపాడటం కోసం కేసీఆర్ బొగ్గు గనుల వేలంలో పాల్గొనలేదు. ఇప్పుడు కేసీఆర్‌ లేకపోవడంతో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కలిసి గనులు వేలం వేస్తున్నారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఎందుకు మాట్లాడటం లేదు. రేవంత్ రెడ్డి ఎందుకు రాజీ పడుతున్నారు? కేసులకు భయపడుతున్నారా?' అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

'8 మందిని బీజేపీ ఎంపీలుగా గెలిపిస్తే ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం కోసం బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి' అని కేటీఆర్‌ ఆరోపించారు. సింగరేణికి ప్రమాదం వస్తే కాపాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో ఉన్న బొగ్గును తవ్వుకోవడానికి మనకు హక్కు లేదా? అని సందేహం వ్యక్తం చేశారు.

హెచ్చరిక
వేలంలో పాల్గొనే వారికి ఈ సందర్భంగా కేటీఆర్‌ హెచ్చరిక జారీ చేశారు. 'ప్రైయివేటు వాళ్లు బొగ్గు గనుల వేలంలో పాల్గొంటే నష్టపోతారు. మా ప్రభుత్వం వస్తే వెంటనే బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేస్తాం. 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి తప్పక వస్తుంది. నాలుగున్నరేళ్ల తర్వాత వచ్చేది మేమే' అని స్పష్టం చేశారు. అప్పుడు నేటి బొగ్గు గనుల వేలం లీజును  రద్దు చేస్తామని సంచలన ప్రకటన చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

 

Section: 
English Title: 
KT Rama Rao Warns To Coal Mine Auction Anyone Gets Lease In 2028 We Will Cancel Rv
News Source: 
Home Title: 

Coal Mine Auction: బొగ్గు వేలంలో పాల్గొనే వారికి కేటీఆర్ హెచ్చరిక.. తస్మాత్ జాగ్రత్త

Coal Mine Auction: బొగ్గు వేలంలో పాల్గొనే వారికి కేటీఆర్ హెచ్చరిక.. తస్మాత్ జాగ్రత్త
Caption: 
KT Rama Rao Coal Mine Auction (Source: File)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Coal Mine Auction: బొగ్గు వేలంలో పాల్గొనే వారికి కేటీఆర్ హెచ్చరిక.. తస్మాత్ జాగ్రత్త
Ravi Kumar Sargam
Publish Later: 
No
Publish At: 
Thursday, June 20, 2024 - 17:03
Created By: 
Ravi Kumar Sargam
Updated By: 
Ravi Kumar Sargam
Published By: 
Ravi Kumar Sargam
Request Count: 
14
Is Breaking News: 
No
Word Count: 
442