KT Rama Rao: 'బీఆర్ఎస్ తోబుట్టువుల్లారా.. మీకు శిరస్సు వంచి సలాం చేస్తున్నా'

KT Rama Rao Emotional New Year Wishes To BRS Party Cadre: కొత్త సంవత్సరం సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీకి వెన్నంటి ఉంటున్న వారి సేవలను గుర్తిస్తూ.. వారికి శిరస్సు వంచి సలాం చేస్తున్నా అని ప్రకటించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 2, 2025, 09:07 PM IST
KT Rama Rao: 'బీఆర్ఎస్ తోబుట్టువుల్లారా.. మీకు శిరస్సు వంచి సలాం చేస్తున్నా'

KTR Emotional: కాంగ్రెస్ నిరంకుశ పాలనపై పోరాటం చేస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు పోరాటం చేస్తుండడంతో వారికి ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ అభినందనలు కురిపించారు. రేవంత్‌ రెడ్డి తప్పిదాలు.. హామీలపై నిలదీస్తున్న గులాబీ సైనికులకు కేటీఆర్‌ సలాం చేశారు. 'నా ప్రాణ సమానమైన.. తోబుట్టువుల్లారా' అంటూ ఆత్మీయంగా పిలుస్తూ వారందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల కృషిని ప్రశంసించారు.

Also Read: K Kavitha: 'రైతులను కేసీఆర్‌ కడుపులో పెట్టుకుంటే.. రేవంత్‌ రెడ్డి సున్నంపెట్టే ప్రయత్నం'

కొత్త సంవత్సరం సందర్భంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు చెబుతూ కేటీఆర్‌ గురువారం 'ఎక్స్‌' వేదికగా కీలక ప్రకటన చేశారు. 'ప్రాణ సమానులైన మన బీఆర్ఎస్ తోబుట్టువుల్లారా.. ఏడాది కాలంగా ఈ కాంగ్రెస్ నిరంకుశ పాలనపై గులాబీ సైనికులందరూ కనబరిచిన పోరాట స్ఫూర్తికి పేరుపేరునా ప్రతి ఒక్కరికి శిరస్సువంచి సలాం చేస్తున్నా' అని కేటీఆర్‌ ప్రకటించారు. 'గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా.. మీరు క్షేత్రస్థాయిలో కనబరిచిన కదనోత్సాహం.. రాష్ట్ర స్థాయిలో పని చేసే నాయకత్వంలో కూడా మాటలకందని స్థాయిలో కొండంత స్ఫూర్తి నింపింది' అని తెలిపారు.

Also Read: Rythu Bharosa: సంక్రాంతికి తెలంగాణ రైతులకు పండుగ.. 14 నుంచి బ్యాంకు ఖాతాల్లోకి రూ.15 వేలు

'తెలంగాణలో గ్రామగ్రామాన ఉన్న గులాబీ సైనికులు రాష్ట్ర ప్రజలపక్షాన.. విరామం ఎరుగని పోరాటం చేస్తున్నారు' అని కేటీఆర్‌ ప్రశంసించారు. 'అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన ఈ తుగ్లక్ పాలన వల్ల కష్టకాలంలో ఉన్నా రైతుల పక్షాన మీరు పోరాడారు. నేతన్నల గొంతుకై మీరు నిలిచారు. మహిళా సమస్యలపై మీరు గర్జించారు. బడుగు బలహీనవర్గాల ప్రజల గళమయ్యారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పక్షాన సమరభేరి మోగించారు. నిరుద్యోగుల హక్కుల కోసం కాంగ్రెస్ సర్కారును నిలదీశారు. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీల గారడీని ప్రజాక్షేత్రంలో ఎండగట్టారు' అంటూ పార్టీ శ్రేణులు చేసిన పోరాటాన్ని కేటీఆర్‌ గుర్తుచేశారు.

'మూసీలో మూటలవేట నుంచి లగచర్ల లడాయి వరకు అన్యాయం జరిగిన ప్రతిచోటా బాధితుల పక్షాన మీరు కొట్లాడారు' అని పార్టీ శ్రేణులను కేటీఆర్‌ అభినందించారు. తెలంగాణ ప్రజల గుండెచప్పుడును అడుగుడుగునా మీరు ప్రతిధ్వనించారని చెప్పారు. 'తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకు మీరు చేసిన పోరాటాలు.. చరిత్రపై చెరగని సంతకాలు' అని ప్రకటించారు. 'తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను అత్యంత సమర్థంగా తిప్పికొట్టిన సందర్భాలు. ఈ పోరాటపథంలో నిలిచి ఉండే మైలురాళ్లు' అని కొనియాడారు.

'తెలంగాణ ప్రజల కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా.. అసమర్థ, అనాలోచిత కాంగ్రెస్ విధానాలపై.. బీఆర్ఎస్ శ్రేణులు మోగించిన జంగ్ సైరన్ రేవంత్‌ రెడ్డికి ముచ్చెమటలు పట్టించింది' అని కేటీఆర్‌ గుర్తుచేశారు. మీ అలుపెరగని పోరాటాల వల్లే అదానీ ఆశజూపిన రూ.100 కోట్లను ప్రభుత్వం వెనక్కి ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. 'దశాబ్దాలపాటు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కుక్కలు చింపిన విస్తరిలా మార్చే కాంగ్రెస్ కుట్రలను.. అడుగడుగునా ప్రశ్నిద్దాం! నిలదీద్దాం!! అడ్డుకుందాం!!!' అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

'పార్టీకి పునాది రాళ్లు మీరే. మన బీఆర్‌ఎస్‌ పార్టీకి మూలస్తంభాలు మీరే. మన గులాబీ జెండాకు.. వెన్నుముక మీరే' అని పార్టీ కార్యకర్తల శ్రేణులను కేటీఆర్‌ ప్రశంసించారు. గులాబీ సైనికులందరికీ... గుండెల నిండా.. మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అని కేటీఆర్‌ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News