Konda Vishweshwar Reddy: కొండా విశ్వేశ్వర్ రెడ్డికి కీలక పదవి కట్టబెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ..

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లను నియమించింది. మరోవైపు పార్లమెంటులో కీలకమైన ప్రభుత్వ విప్ పదవిలను భర్తీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా భారతీయ జనతా పార్టీ లోక్ సభలో ప్రభుత్వ విప్ పదవిని డాక్టర్ సంజయ్ జైస్వాల్ ను నియమించింది. ఈయనతో పాటు 16 మంది లోక్ సభ ఎంపీలకు విప్ పదవిలను కట్టబెట్టింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 30, 2024, 09:58 AM IST
Konda Vishweshwar Reddy: కొండా విశ్వేశ్వర్ రెడ్డికి కీలక పదవి కట్టబెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ..

Konda Vishweshwar Reddy: కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లను నియమించింది. మరోవైపు పార్లమెంటులో కీలకమైన ప్రభుత్వ విప్ పదవిలను భర్తీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా భారతీయ జనతా పార్టీ లోక్ సభలో ప్రభుత్వ విప్ పదవిని డాక్టర్ సంజయ్ జైస్వాల్ ను నియమించింది. ఈయనతో పాటు 16 మంది లోక్ సభ ఎంపీలకు విప్ పదవిలను కట్టబెట్టింది.

దిలీప్ సల్కియా, గోపాల్ జీ ఠాకూర్, సంతోష్ పాండే, కమల్ జీత్ షెరావత్, దావల్ లక్ష్మణ్ భాయ్ పటేల్, దేవ్ సింగ్ చౌహాన్, జుగల్ కిషోర్ శర్మ, కోట శ్రీనివాస్ పూజారి, సుధీర్ గుప్తా, స్మితా ఉదయ్ వాగ్, అనంత నాయక్, దామోదర్ అగర్వాల్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సతీష్ కుమార్ గౌతమ్, శశాంక్ మణి, ఖగేన్ ముర్ములకు కీలకమైన విప్ పదవిలను కట్టబెట్టింది.

ఇప్పటికే తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి కేంద్ర క్యాబినేట్ పదవిని కట్టబెట్టింది మోడీ సర్కారు. అటు బండి సంజయ్ కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవి కట్టబెట్టన సంగతి తెలిసిందే కదా. తాజాగా మరో తెలంగాణ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి లోక్ సభలో కీలకమైన విప్ పదవి కట్టబెట్టడం విశేషం.

కొండా విశ్వేశ్వర్ రెడ్డి 2024 ఎన్నికల్లో బీజేపీ తరుపు ఎంపీగా గెలిచారు. గతంలో 2014-2019 వరకు ఈయన చేవేళ్ల నుంచి టీఆర్ఎస్ తరుపున ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2019లో ఈయన కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. మొత్తంగా మూడు ఎన్నికల్లో మూడు పార్టీల నుంచి పోటీ చేసి రెండు సార్లు ఎంపీగా గెలవడం విశేషం. మొత్తంగా బీజేపీ అధిష్ఠానం తెలంగాణపై మంచి ఫోకసే పెడుతోంది.

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News