Kollapur Fight: తగ్గేదే లే అంటున్న జూపల్లి.. తొడగొడుతున్న హర్షవర్ధన్! పోలీస్ పహారాలో కొల్లాపూర్..

Kollapur Fight: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో హై టెన్షన్ నెలకొంది. అధికార పార్టీ నేతల ఆదిపత్య పోరు రచ్చకెక్కడంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రస్తుత ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పరస్పర సవాళ్లు విసురుకోవడంతో పాటు బహిరంగ చర్చకు సిద్ధం కావడంతో కొల్లాపూర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Written by - Srisailam | Last Updated : Jun 26, 2022, 07:50 AM IST
  • పోలీస్ పహారాలో కొల్లాపూర్
  • జూపల్లి, హర్షవర్ధన్ రెడ్డి హౌజ్ అరెస్ట్
  • టీఆర్ఎస్ వర్గపోరుతో రచ్చ
Kollapur Fight: తగ్గేదే లే అంటున్న జూపల్లి.. తొడగొడుతున్న హర్షవర్ధన్!  పోలీస్ పహారాలో కొల్లాపూర్..

Kollapur Fight: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో హై టెన్షన్ నెలకొంది. అధికార పార్టీ నేతల ఆదిపత్య పోరు రచ్చకెక్కడంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రస్తుత ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పరస్పర సవాళ్లు విసురుకోవడంతో పాటు బహిరంగ చర్చకు సిద్ధం కావడంతో కొల్లాపూర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. అధికార పార్టీ నేతలు తమ వర్గీయులను మోహరించే అవకాశాలు ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీగా బలగాలను మోహరించారు. ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును హౌజ్ అరెస్ట్ చేశారు. ఇరు వర్గాలను చెందిన ముఖ్య నేతలను ఇళ్లలోనే దిగ్బంధం చేశారు. కొల్లాపూర్ లో 144 సెక్షన్ విధించారు. అధికార పార్టీ నేతల తీరు, పోలీసుల పహారాతో సామాన్య జనాలు ఇబ్బందులు పడుతున్నారు.

కొల్లాపూర్ నియోజకవర్గంలో కొంత కాలంగా జూపల్లి, హర్షవర్ధన్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. కేసీఆర్ తొలి ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన జూపల్లి కృష్ణారావు.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బీరం హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. తర్వాత బీరం టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి జూపల్లి, బీరం మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. అభివృద్ధి విషయంలో సవాళ్లు విసురుకున్నారు. ఇటీవల కాలంలో ఇది మరింతగా ముదిరింది. జూపల్లి, బీరం వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా కొల్లాపూర్ నియోజకవర్గంలో గొడవలే జరుగుతున్నాయి.  ఈ నేపథ్యంలోనే అభివృద్ధిపై తనతో చర్చకు రావాలని జూపల్లి సవాల్ చేయగా.. బీరం కూడా సై అన్నారు. అంబేద్కర్ విగ్రహం దగ్గరకు రావాలని సవాల్ చేసుకున్నారు. దీంతో పోలీసులు ముందస్తుగానే ఇద్దరు నేతలను హౌజ్ అరెస్ట్ చేశారు.

ఇటీవలే నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. జూపల్లి, హర్షవర్ధన్ మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. జూపల్లి ఇంటికి వెళ్లి అతనితో మాట్లాడారు. కేటీఆర్ టూర్ తర్వాత పరిస్థితి చక్కబడుతుందని కొల్లాపూర్ టీఆర్ఎస్ కార్యకర్తలు భావించారు. కాని సీన్ మరోలా మారింది. విభేదాలు మరింతగా ముదిరిపోయాయి. అంతేకాదు శనివారం జూపల్లి సంచలన కామెంట్లు చేశారు. ఎమ్మెల్యేకు  తనకు మధ్య జరిగే చర్చకు కేటీఆర్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కొల్లాపూర్ అంబేద్కర్ విగ్రహం దగ్గరే తేల్చుకుంటానని చెప్పారు. తన ఇమేజ్ డ్యామేజ్ చేస్తే చేతులు కట్టుకుని ఇంట్లో ఎలా కూర్చూంటానని జూపల్లి అన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలకు ఎమ్మెల్యే ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఎంత దూరమైనా వెళతానని జూపల్లి కృష్ణారావు తేల్చి చెప్పారు. పార్టీ మార్పుపై వస్తున్న వార్చలపైనా స్పందించిన జూపల్లి.. అవన్ని తప్పుడు వార్తలని చెప్పారు. కావాలనే తనపై కొందరు కుట్రలు చేస్తున్నారని.. బీజేపీలో చేరుతారని కొన్ని రోజులు.. కాంగ్రెస్ లోకి వెళుతున్నారని మరికొన్ని రోజులు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

Also read : Revanth Reddy: కేసీఆర్ లో కలవరం.. రేవంత్ రెడ్డి టీమ్ సంబురం! పీకే సర్వేలో ఏముంది?

Also read : Teachers Assets Declaration: టీచర్ల ఆస్తుల లెక్కలపై వెనక్కి తగ్గిన కేసీఆర్ సర్కారు

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News