HYDRAA Demolish: మూసీ నది పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలతో పెద్ద ఎత్తున తీవ్ర విమర్శలు వస్తుండడం.. న్యాయస్థానం కూడా తప్పుబట్టడం.. బీఆర్‌ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలోకి వెళ్లడంతో వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు స్పందించి మీడియాతో సమావేశమయ్యారు. హైడ్రా తప్పిదాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూనే బీఆర్‌ఎస్ పార్టీపై విమర్శలు చేశారు. హైడ్రా పాపాన్ని కేసీఆర్ ప్రభుత్వానికి నెట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Musi Demolish: కూల్చివేతలపై హైడ్రా సంచలన ప్రకటన.. 163 ఇళ్లు నేలమట్టం, మరో 700 ఇళ్లు కూలుస్తాం
'పేదల అవసరాలను తీర్చడాన్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. మూసీ ప్రక్షాళన ఎవరూ చేయమన్నారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. 2017లో మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది' అని శ్రీధర్ బాబు గుర్తు చేశారు. 'మూసీ నది తీరంలో అక్రమ కట్టడాలు లెక్కలు, బఫర్ జోన్ ఫిక్స్ చేయాలని ఆదేశాలు కేసీఆర్ ప్రభుత్వంలోనే నిర్ణయం తీసుకున్నారు. మూసీలో అక్రమ కట్టడాలు కూల్చడానికి లిస్టు తయారు చేయమని గత మున్సిపల్ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు' అని మంత్రి తెలిపారు.
Also Read: Dusshera Special: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. బతుకమ్మ, దసరాకు లక్కీ చాన్స్
'మూసీ పక్కన 50 మీటర్ల వరకు బఫర్ జోన్‌గా పరిగణలోకి తీసుకోవాలని బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వమే నిర్ణయించింది' అని శ్రీధర్ బాబు చెప్పారు. మూసీ ప్రాంత ప్రజలను అక్కడి నుంచి తరలించి నష్టపరిహారం ఇవ్వాలని గత ప్రభుత్వమే నిర్ణయించినట్లు తెలిపారు. మూసీలో లక్షా 50 వేల క్యూసెక్కులు దాటి వరద వస్తే ఆ పరివాహక ప్రాంత ప్రజలకు ప్రమాదం అని సర్వేలు చెబుతున్నాయని వివరించారు. అన్ని రకాల నిర్ణయాలు తీసుకొని అంతా ఫైనల్ అయ్యాక ఆ రోజు గత ప్రభుత్వం పక్కనపెట్టిందని పేర్కొన్నారు.
'వాళ్లు ఆలోచన చేసిన నిర్ణయాలను మేము అమలు చేస్తే తప్పు చేసినట్లా?' అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పార్టీ ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తోందని తెలిపారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల విషయంలో కేసీఆర్ కనికరం చూపించలేదని చెప్పారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు ఎందుకు డబుల్ బెడ్ రూమ్‌లు ఇవ్వలేదు? అంటూ నిలదీశారు. ప్రజల మద్దతుతోనే మూసీ ప్రక్షాళన చేస్తాం' అని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.