రంజాన్, క్రిస్మస్, బోనాలు అధికార పండుగలు

దేశంలో మరే రాష్ట్రంలో లేనట్టు తెలంగాణ రాష్ట్రంలో రంజాన్, క్రిస్మస్, బోనాలు పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు అన్నారు.

Last Updated : Dec 26, 2017, 05:24 PM IST
రంజాన్, క్రిస్మస్, బోనాలు అధికార పండుగలు

దేశంలో మరే రాష్ట్రంలో లేనట్టు తెలంగాణ రాష్ట్రంలో రంజాన్, క్రిస్మస్, బోనాలు పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు అన్నారు. శుక్రవారం నిజాం గ్రౌండ్స్ లో ఏర్పాటుచేసిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం ముఖ్యఅతిథిగా హాజరై చిన్నారులతో కలిసి కేకు కట్ చేశారు. అంతకు ముందు సీఎం కేసిఆర్ చిన్నారులకు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ - తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం. ఈ రాష్ట్రంలో అన్ని మతాలవారిని ఒకేలా చూస్తున్నాం. వారికి రక్షణ కలిపిస్తున్నాం. పండుగలేవైనా పెద్ద ఎత్తున నిర్వహించి సోదరభావాన్ని నింపుతున్నాం" అన్నారు. 

రాష్ట్రంలో రంజాన్, క్రిస్మస్, బోనాలు పండుగలను అధికారిక పండుగలుగా నిర్వహిస్తున్నాం. రంజాన్ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నందున జమ్ముకాశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ నేరుగా ఫోన్ చేసి అభినందించారన్నారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా క్రిస్టియన్ భవన నిర్మాణం, చర్చిల మరమ్మతుల కోసం రూ.10 కోట్లు మంజూరు, పవిత్ర పుణ్యక్షేత్రం జెరూసలేంకు వెళ్లే క్రిస్తియన్లకు  సబ్సిడీతో వసతి సహా పలు రాయితీలు ఇచ్చారు. హైదరాబాద్ లో క్రిస్టియన్ భవనం కట్టాలన్నది నా కల. వచ్చే క్రిస్మస్ నాటికి ఆ భవనం పూర్తవుతుందని నేను హామీ ఇస్తున్నా అన్నారు సీఎం కేసిఆర్. అనంతరం వివిధ రంగాల్లో సేవలందించిన క్రిస్టియన్లకు, క్రిస్టియన్ సంస్థలకు ప్రభుత్వం తరుఫున అవార్డులు అందించారు కేసిఆర్. 

Trending News