Bandi Sanjay: మంత్రి గంగులకు బండి సంజయ్ ఓపెన్ ఛాలెంజ్.. దమ్ముంటే రావాలని సవాల్

Bandi Sanjay Challenge Gangula Kamalakar: మంత్రి గంగుల కమలాకర్‌కు బండి సంజయ్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. తానను అవినీతిపరుడని అంటున్న కమలాకర్.. ఆ ఆస్తి డాక్యుమెంట్లను తీసుకువస్తే ప్రజలకు రాసిచ్చేందుకు సిద్ధమని సవాల్ విసిరారు.   

Last Updated : Nov 19, 2023, 12:16 PM IST
Bandi Sanjay: మంత్రి గంగులకు బండి సంజయ్ ఓపెన్ ఛాలెంజ్.. దమ్ముంటే రావాలని సవాల్

Bandi Sanjay Challenge Gangula Kamalakar: "గంగుల కమలాకర్ నిన్న కొత్తకొత్త మాటలు చెబుతుండు.. ఈసారి గెలిపిస్తే కొత్త రేషన్ కార్డులు ఇస్తడట.. అందరికీ ఇండ్లు ఇస్తడట.. బండి సంజయ్ కంటే గొప్ప హిందువును నేనేనని ప్రచారం చేస్తున్నడు.. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. మంత్రిగా పనిచేసినవ్. రేషన్ కార్డుల మంత్రివి కూడా నువ్వే.. ఎంతమందికి రేషన్ కార్డులిచ్చినవ్. బీసీ మంత్రివి నువ్వే కదా.. బీసీ బంధు ఎంతమంది బీసీలకు ఇచ్చినవ్? 10 ఏళ్లుగా ఎంతమంది పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చినవ్?

నన్ను ఎంపీగా గెలిపిస్తే.. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం 9 వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చిన. ఆర్వోబీ, స్మార్ట్ సిటీ, రోడ్లు, వీధి దీపాలుసహా గ్రామాల్లో, పట్టణాల్లో జరిగే అభివృద్ధి పనులకు కేంద్రంతో మాట్లాడి నిధులు తెచ్చింది నేనే.. మోదీ గత 6 నెలల్లోనే 6 లక్షల ఉద్యోగాలిచ్చారు. ఒక్క అవినీతి లేకుండా నేరుగా అపాయిట్ మెంట్ లెటర్లు ఇచ్చారు.. మరి నేనడుగుతున్నా.. కేసీఆర్ ఎంతమందికి ఉద్యోగాలిచ్చారు..? ఎంత మందికి నిరుద్యోగ భృతి ఇచ్చారో చెప్పాలి..?

మీ కోసం నేను కొట్లాడిన. నిరుద్యోగుల కోసం పోరాడితే నన్ను అర్ధరాత్రి గుంజుకుపోయి జైల్లో వేశారు.. ఉద్యోగుల కోసం పోరాతే నా ఆఫీస్ ధ్వంసం చేసి నన్ను లాక్కుపోయి జైల్లో వేశారు. పండించిన వడ్లను కొనాలని రైతుల పక్షాన నేను ధాన్యం కేంద్రాలకు పోతే.. నాపైనా, బీజేపీ కార్యకర్తలపైనా రాళ్ల దాడి చేసిర్రు. మీకు తెలుసా.. మీ కోసం నేను పోరాడితే కేసీఆర్ ప్రభుత్వం నాపై 74 కేసులు పెట్టారు. అయినా నేను భయపడలే.. మీకోసం ఎందాకైనా పోరాడతా.. 

నా భార్యాపిల్లలను పక్కనపెట్టి  మీకోసం కొట్లాడితే.. నేను సంపాదించిన ఆస్తి ఏందో తెలుసా..? 74 కేసులు.. మరి కమలాకర్ ఎవరి కోసం కొట్లాడిండు..? ఎన్నిసార్లు జైలుకు పోయిండు? మీరే ఆలోచించాలి. ఫస్ట్ నాడు జీతాలే ఇయ్యలేని కేసీఆర్, కమలాకర్ మళ్లీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి శ్రీలంక దుస్థితిని తీసుకొస్తడు.. పుట్టబోయే బిడ్డపై 2 లక్షలకు పైగా అప్పు భారం మోపుతాడు.. ఇన్నాళ్లు కొండలు, గుట్టలు మాయం చేసి అడ్డగోలుగా సంపాదించి గ్రానైట్ కార్మికుల సంఘం ఎన్నికలు జరగకుండా చేస్తున్నడు.. మళ్లీ చెబుతున్నా.. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి.. గంగుల ఏకఛత్రాధిపత్యాన్ని బద్దలు కొడతా.. ఎవడు అడ్డమొస్తడో చూస్తా..గ్రానైట్ యూనియన్ ఎన్నికలు జరిపించి తీరుతా.." అని బండి సంజయ్ అన్నారు.

Trending News