Jubili Hills Election Result 2023: జూబిలీహిల్స్‌పై అజ్జూ భాయ్ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాడా

Jubili Hills Election Result 2023: మరి కాస్సేపట్లో తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. డీ లిమిటేషన్‌లో పేరు మార్చుకున్న ఒకప్పటి పెద్ద నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ హోరాహోరీ పోరులో విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తి రేపుతోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 3, 2023, 08:14 AM IST
Jubili Hills Election Result 2023: జూబిలీహిల్స్‌పై అజ్జూ భాయ్ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాడా

Jubili Hills Election Result 2023:  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద నియోజకవర్గంగా ఉన్న ఖైరతాబాద్ 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో నియోజకవర్గం చీలిపోయింది. మెజార్టీ భాగాలతో ఏర్పడిన కొత్త నియోజకవర్గం జూబిలీహిల్స్‌పై కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు మాజీ క్రికెటర్ చేసిన ప్రయత్నాలు సఫలం కానున్నాయా లేదా..

ఖైరతాబాద్ నియోజకవర్గం. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం. 2009 డీ లిమిటేషన్ తరువాత కూకట్ పల్లి, జూబిలీహిల్స్‌గా చీలిపోయింది. కొన్ని ప్రాంతాలు కలిశాయి. కొన్ని వేరే నియోజకవర్గాల్లోకి వెళ్లిపోయాయి. ఖైరతాదాబ్ అంటే చాలు కాంగ్రెస్ సీనియర్ నేత దివంగత పీజేఆర్ ఒక్కరే గుర్తొస్తారు. ఆయన మరణానంతరం కుమారుడు విష్ణువర్ణన్ రెడ్డి ఎన్నికయ్యారు. 2009లో కూడా జూబిలీహిల్స్ నుంచి పోటీ చేసి గెలిసిన విష్ణువర్ధన్ రెడ్డి ఎందుకో ఆ తరువాత 2014, 2018లో గెలవలేకపోయారు. బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి గోపీనాథ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 

జూబిలీహిల్స్ అంటేనే హైదరాబాద్ ప్రాంతంలో అత్యంత రిచ్ ప్రాంతం. ల్యాండ్ రేట్ ఊహకు అందకుండా ఉంటుంది. పెద్ద పెద్ద సెలెబ్రిటీలు, వ్యాపారవేత్తలు, బిలియనీర్లతో పాటు పేద, మధ్య తరగతి వర్గాలు కూడా ఉండే ప్రాంతమిది. మెహదీపట్నం, టోలీచౌకి వంటి ముస్లిం ప్రాబల్య ప్రాంతాలు ఈ నియోజకవర్గ పరిధిలోనికే వస్తాయి. ఈసారి ఈ సీటు గెలవాలనే ఆలోచనలో ఇక్కడున్న మైనార్టీ ఓట్లను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను రంగంలో దించింది. దీంతో అలిగిన విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. 

వాస్తవానికి అజూరుద్దీన్ స్థానికుడే అయినా రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. 2009లో కాంగ్రెస్‌లో చేరిన అజారుద్దీన్ యూపీ మురాదాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. స్థానికంగా ఉన్న ముస్లింలు కూడా ఈసారి కాంగ్రెస్‌కు ఓటేయాలని నిర్ణయించుకోవడంతో అజురుద్దీన్ గట్టెక్కవచ్చనే తెలుస్తోంది. దీనికితోడు అధికార పార్టీపై వరుసగా పదేళ్ల నుంచి ఉన్న వ్యతిరేకత తోడు కానుంది. అయితే మైనార్టీ ఓట్లను చీల్చేందుకు మజ్లిస్ ఇక్కడ అభ్యర్ధిని రంగంలో దించడం వల్ల ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది. 

Also read: Telangana Congress Plans: తెలంగాణ మిస్ కాకూడదు, రెండు ప్లాన్స్ సిద్ధం చేసిన కాంగ్రెస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News