ఆత్మరక్షణలో పడ్డ కేసీఆర్ ; ప్రచారంలో ఎమోషనల్ బ్లాక్ మెయిల్ !!

                           

Last Updated : Nov 22, 2018, 07:09 PM IST
ఆత్మరక్షణలో పడ్డ కేసీఆర్ ; ప్రచారంలో ఎమోషనల్ బ్లాక్ మెయిల్ !!

తెలంగాణ ఆపధార్మ ముఖ్యమంత్రి కేసీఆర్..ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారా ? అంటే ఔననే సమాధానం వస్తోంది జనాల నోట. కేసీఆర్ ప్రసంగంలో టీఆర్ఎస్ గెలుపు ధీమా కంటే మహాకూటమి విజయం సాధిస్తుందనే భయం ఎక్కువగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ టీఆర్ఎస్ కు ఏమైంది.. కేసీఆర్ ఎందుకిలా డీలా పడ్డారు అనేది తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్ళాల్సిందే..

కొండలనైనా పిండి చేసేంత ఆత్మవిశ్వాసం కనబరిచే తెలంగాణ ఆపధార్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు ఢీలా పడ్డారు. అసెంబ్లీ రద్దు నిర్ణయం కంటే ముందు తాము వంద సీట్లు గెలుస్తామని చెప్పిన  కేసీఆర్.. ఇప్పుడు మాట్లాడటం లేదు.  తమ ప్రభుత్వ విజయాల గురించి గట్టిగా చెప్పలేకపోతున్నారు...ప్రచారంలో ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. - పొరపాటును కాంగ్రెస్ గెలిస్తే చీకటే.. మహాకూటమి గెలిస్తే మళ్లీ బానిసబతుకులు ఖాయం... చంద్రబాబు మనకు అవసరామా ? .. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే తనకు పెద్దగా వచ్చే నష్టమేమి లేదని.. తెలంగాణ ప్రజలే తీవ్రంగా నష్టపోతారు..ఇలా ప్రచారంలో ఎమోషనల్ బ్లాక్ మెయిల్ వ్యాఖ్యలు కేసీఆర్ నోట పదే పదే రావడం దేనికి సంకేతం. తరచూ  ఆయన చేసే ప్రతి ప్రసంగంలో ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి. దీంతో కేసీఆర్ లో తాము గెలుస్తామనే నమ్మకం సన్నగిల్లుతోందనే వాదనకు బలం చేకూరుతోంది.

అప్పటికి ఇప్పటికీ కేసీఆర్ లో ఎంత మార్పు..!!
ఉద్యమం సమయంలో తెలంగాణ వాదాన్ని ఢిల్లీ గల్లీల వరకు వినబడింది కేసీఆర్ స్వరం. తన స్వరంతో రాజకీయ నేతలు ముమ్మతిప్పలు పెట్టిన కేసీఆర్..ఇప్పుడు అంతగా ప్రసంగించలేకపోతున్నారు అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమౌతుంది.  కేసీఆర్ ప్రసంగంలో వాడి తగ్గడానికి కారణం కొంత వరకు ఆరోగ్య సమస్యలైతే ..తెలంగాణలో ఏర్పడిన పరిస్థితిలు కూడా మరో కారణంగా చెప్పవచ్చు. మహాకూటమి పేరుతో రాజకీయపార్టీలన్నీ ఏకవమవడం.దీనికి మేధావులు , తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు కూడా మద్దుతు తెలపడంతో కేసీఆర్ కు మింగుపడని విషయం. దీనికి తోడు ప్రభుత్వంపై వివిధ వర్గాల్లో నెలకొన్న  వ్యతిరేకత.. ఇవన్ని లెక్కలు కట్టిన కేసీఆర్ కు తాను ఓడిపోతామనే భయంతో ఇలాంటి మాటలు మాట్లుడుతున్నారనే రాజకీయవర్గాలు విమర్శలు చేస్తున్నాయి. 

గెలుపు ఖాయమంటున్న టీఆర్ఎస్ వర్గాలు
ఇదిలా ఉండగా టీఆర్ఎస్ వర్గాలు ఈ వాదనను ఖండిస్తున్నాయి.  ప్రచారం చేయకపోయినా ప్రజలు తమను గెలిపిస్తారని.. ఆ ధీమాతోనే కేసీఆర్ ఉన్నారని వాదిస్తున్నారు. ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ప్రచారం అవసరం లేదని..ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొడితే సరిపోతుందనే ఉద్దేశంతోనే తమ అధినేత కేసీఆర్ ..ఎక్కువగా ప్రతిపక్షాలపై విమర్శల దాడి దిగిందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని..100 సీట్లు కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుందని టీఆర్ఎస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Trending News