Komatireddy:మునుగోడులో కోమటిరెడ్డి ఒంటరయ్యారా? అందుకే రాజీనామాకు భయపడుతున్నారా?

Komatireddy: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్నారు సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. తాను కేసీఆర్ పై యుద్ధం చేయబోతున్నానంటూ ప్రకటనలు చేస్తున్నారు కోమటిరెడ్డి. రాజగోపాల్ రెడ్డి 

Written by - Srisailam | Last Updated : Jul 31, 2022, 07:55 AM IST
  • రాజీనామాపై కోమటిరెడ్డి ఊగిసలాట
  • రాజగోపాల్ రెడ్డికి అనుచరుల షాక్
  • కోమటిరెడ్డికి ఓటమి భయం?
Komatireddy:మునుగోడులో కోమటిరెడ్డి ఒంటరయ్యారా? అందుకే రాజీనామాకు భయపడుతున్నారా?

Komatireddy: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్నారు సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. తాను కేసీఆర్ పై యుద్ధం చేయబోతున్నానంటూ ప్రకటనలు చేస్తున్నారు కోమటిరెడ్డి. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెబుతుండగా.. కాంగ్రెస్ లోనే కొనసాగేలా బుజ్జగిస్తామని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క చెబుతున్నారు. కోమటిరెడ్డి పార్టీ మారకుండా చూసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కూడా రంగంలోకి దిగింది. కోమటిరెడ్డి పార్టీ మార్పుపై రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తుండగా.. ఆయన మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా చేయరా అన్నది మరో ప్రశ్నగా మారింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకే పార్టీలో చేరాలని కోమటిరెడ్డికి బీజేపీ కండీషన్ పెట్టిందని తెలుస్తోంది. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చేయబోతున్నారు.. మునుగోడుకు ఉప ఎన్నికల రావడం ఖాయమేనా అన్న చర్చలు సాగుతున్నాయి. 

శనివారం మునుగోడు నియోజకవర్గంలో పర్యటించిన కోమటిరెడ్డి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మరో 15 రోజుల్లో సీఎం కేసీఆర్ పై యుద్దం మొదలవుతుందని చెప్పారు. అంటే మరో 15 రోజుల తర్వాతే ఆయన పార్టీ మార్పు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా అంశంపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. పార్టీ మారాలని నిర్ణయించుకున్నా కోమటిరెడ్డి ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నారన్నది పలు అనుమాలకు తావిస్తోంది. బీజేపీలో చేరాలని డిసైడ్ అయినా.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా విషయంలోనే ఆయన వెనుకంజ వేస్తున్నారని అంటున్నారు. ఉప ఎన్నికలో ఓటమి భయం ఆయనను వెంటాడుతుందని తెలుస్తోంది. మునుగోడులో బీజేపీ బలం అంతంతమాత్రమే. 2018 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన గంగడి మనోహర్ రెడ్డికి కేవలం 12 వేలు( 6శాతం ) ఓట్లు మాత్రమే వచ్చాయి. తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కమలం పార్టీ ఐదారు గ్రామాలు మినహా గెలవలేకపోయింది. 

మునుగోడులో బీజేపీ వీక్ గా ఉండగా.. కోమటిరెడ్డి పార్టీ మారితే ఆయన వెంట వెళ్లేందుకు నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కోమటిరెడ్డి ఎంతగా చెబుతున్నా ఆయన అనుచరులు బీజేపీలో చేరేందుకు ముందుకు రావడం లేదని సమాచారం. హైదరాబాద్ లోని తన నివాసంలో నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల నేతలతో రాజగోపాల్ రెడ్డి సమావేశాలు జరిపారు. ఈ సమావేశానికి నేతలు భారీగానే వచ్చినా.. వాళ్లంతా తమ అభిప్రాయం కుండబద్దలు కొట్టారని తెలుస్తోంది. తాము బీజేపీలో చేరబోమని మెజార్టీ నేతలు స్పష్టం చేశారట. అంతేకాదు ఉపఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేస్తే ఓడిపోతారని కూడా కోమటిరెడ్డికి నేరుగా చెప్పారని సమాచారం. తాము బీజేపీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారట. కోమటిరెడ్డి మాత్రం హైదరాబాద్ సమావేశానికి వచ్చిన నేతలంతా తనతో వచ్చేవారేనని మీడియాకు బలం చూపించుకున్నారని అంటున్నారు. హైదరాబాద్ సమావేశానికి వెళ్లిన నేతలో 90 శాతం మంది బీజేపీలో చేరబోమని ఖరాఖండిగా చెప్పారని తెలుస్తోంది. కోమటిరెడ్డి బీజేపీలో చేరితే ఆయన అనచరులు కొందరు అధికార పార్టీలో చేరాలని చూస్తున్నారని టాక్. 

కోమటిరెడ్డి తనతోపాటు కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలను సమీకరించి బీజేపీలో చేరాలని ప్లాన్ చేశారట. అయితే ఎమ్మెల్యేలు కాకు కదా ఆయన నియోజకవర్గ నేతలు కూడా బీజేపీలో చేరడానికి ముందుకు రాకపోవడంత కోమటిరెడ్డి షాక్ అయ్యారని అంటున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి సన్నిహితులు కొందరు కారు పార్టీలో చేరిపోయారు. రాజీనామా చేస్తే మునుగోడులో గెలిచే పరిస్థితి లేదని రాజగోపాల్ రెడ్డికి కూడా అర్థమైందని.. అందుకే రాజీనామాపై 15 రోజుల గడువు పెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారనే  ప్రచారం సాగుతోంది. 15 రోజుల గడువులో తన అనుచరులను మెప్పించి కొందరినైనా కమలం పార్టీలో చేర్చాలని  రాజగోపాల్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తనను సస్పెండ్ చేస్తే ఎమ్మెల్యే పదవికి అనర్హత వేటు ఉండదని.. అప్పుడు ఉపఎన్నిక సమస్య కూడా ఉండదనే యోచనలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు.

Also read:Bhatti Vikramarka: రాజగోపాల్ రెడ్డిని ఒప్పించే ప్లాన్ ఉంది..సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు..!

Also read:DK Aruna: కుటుంబ విభేదాలతోనే షర్మిల పార్టీ పెట్టారు..డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News