తెలంగాణ ఎన్నికలపై ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుమల పర్యటనలో ఉన్న లగడపాటి మీడియాతో మాట్లాడుతూ.. ఈ సారి ఎన్నికల్లో భిన్నమైన ఫలితాలు వస్తాయని.. చాలా స్థానాల్లో ప్రధాన పార్టీలను తిరస్కరిస్తున్నారని సంచలన కామెంట్స్ చేశారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వతంత్ర అభ్యర్ధుల వైపు మొగ్గుచూపుతున్నారని తెలిపారు. 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8-10 స్థానాల్లో ఇండిపెండెట్లు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట్ లో శివకుమార్, ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో అనిల్ జాదవ్ గెలుస్తారని లగడపాటి జోస్యం చెప్పారు. డిసెంబర్ 7న ఎన్నికలు ముగిసిన అనంతరమే తన సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటిస్తానని లగడపాటి వెల్లడించారు ఈ సారి ఎన్నికలు ఆసక్తికరంగా ఉత్కంఠంగా జరగనునున్నాయని మాత్రమే చెప్పగలనని లగడపాటి పేర్కొన్నారు.