/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Khairatabad Ganesh immersion : భక్తుల కోలాహలం మధ్య  పంచముఖ రుద్ర మహా గణపతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర సందడిగా సాగింది. ఇవాళ ఉదయం 8.18 గంటలకు ప్రారంభమైన గణనాథుని శోభాయాత్ర ప్రారంభమైంది. గత తొమ్మిది రోజులుగా మహాగణపతి దర్శనం కోసం హైదరాబాద్‌ పాటు వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ట్యాంక్‌బండ్‌పై (tank bund) చివరి పూజల తర్వాత మహాగణపతి నిమజ్జన ప్రక్రియ పూర్తిచేశారు.

ఖైరతాబాద్‌ గణేశుడు (khairatabad ganesh) గంగమ్మ ఒడిలో చేరడానికి ముందుకు సాగుతున్న తరుణంలో గణనాథుడిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రత్యేకంగా సిద్ధం చేసిన భారీ ట్రాలీపై ఖైరతాబాద్‌ గణేషుని (Khairatabad Ganesh) ఊరేగింపు కొనసాగింది. మొత్తం 2.5 కిలోమీటర్లు ఈ శోభాయాత్ర సాగింది. ఎన్టీఆర్‌ మార్గ్‌లో నుంచి ట్యాంక్‌బండ్‌కు మహాగణపతిని తీసుకువచ్చారు. క్రేన్ నెంబర్‌ 4 దగ్గర ఖైరతాబాద్‌ పంచముఖ రుద్ర మహాగణపతి నిమజ్జనం చేశారు. అయితే నిమజ్జనం చూసేందుకు హుస్సేన్‌సాగర్‌ దగ్గర భక్తులు పోటెత్తారు. నవరాత్రులు పూజలందుకున్న గణనాధునికి ఘనంగా వీడ్కోలు పలికారు భక్తులు. వినాయక నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌పై 15 క్రేన్లు ఏర్పాటు చేశారు. గతంలో 27 క్రేన్‌లను ఏర్పాటు చేయగా, ఈ ఏడాది వాటిని కుదించారు.

 

Also Read : Punjab New CM: కొత్త సీఎంగా సుఖ్‌జిందర్‌ సింగ్‌ రంధావా!

భారీ బందోబస్తు

మరోవైపు బాలాపూర్‌ గణపతి నిమజ్జనం కూడా జరగనుంది. పది అడుగులు ఆపై ఎత్తు ఉన్న విగ్రహాలను ట్యాంక్‌ బండ్‌ వైపు మళ్లిస్తున్నారు. పది అడుగుల లోపు విగ్రహాలు ఎన్టీఆర్‌ మార్గ్‌, పీవీ మార్గ్‌లో నిమజ్జనం చేస్తున్నారు. వీటితో పాటు నగరం శివారుల్లోని జలాశయాల్లో నిమజ్జనం కొనసాగుతోంది. ఇక ఆదివారం జరుగుతోన్న సామూహిక నిమజ్జనాన్ని పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఒక్క ట్యాంక్‌బండ్‌పైనే బందోబస్తు కోసం 600 మంది పోలీసులు (police) విధులు నిర్వహిస్తున్నారు. రెండు క్రేన్లకు ఒక సీఐ, ప్రతి క్రేన్‌కు ఒక ఎస్‌ఐతో పాటు నలుగురు సిబ్బంది నిమజ్జన ఘట్టాన్ని పర్యవేక్షిస్తున్నారు. కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నిమజ్జన ఏర్పాట్లను డీజీపీ మహేందర్‌ రెడ్డి  (DGP Mahendar Reddy) పర్యవేక్షిస్తున్నారు.

చివరి నిమజ్జనం

గత 66 సంవత్సరాలుగా ఖైరతాబాద్‌ బడా గణేశున్ని హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేస్తూ వచ్చారు. అయితే ట్యాంక్‌బండ్‌లో ఖైరతాబాద్‌ గణేశుడి చివరి నిమజ్జనం ఇదే. వచ్చే ఏడాది నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నారు. దీంతో వేలాది మంది ప్రజలు, భక్తులు ఈసారి ఖైరతాబాద్‌ పంచముఖ గణపతిని సాగనంపారు. కాగా దేశ‌వ్యాప్తంగా ప్ర‌సిద్ధి చెందిన ఖైర‌తాబాద్ వినాయ‌కుడు (Ganesh) వచ్చే ఏడాది నుంచి మ‌ట్టి గ‌ణ‌ప‌తిగా ద‌ర్శ‌న‌మియ్య‌నున్నాడు. వ‌చ్చే ఏడాది 70 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ప్రతిష్టించిన చోటే నిమజ్జనం చేయనున్నారు.

Also Read : Hero Vijay: సొంత తల్లిదండ్రులపైనే కేసు పెట్టిన తమిళ స్టార్ హీరో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Immersion of Hyderabad's tallest Ganesh idol Khairatabad Ganesh immersion completed
News Source: 
Home Title: 

Khairatabad Ganesh : ఖైరతాబాద్‌ గణేశుడి నిమజ్జనం పూర్తి, ఈ ఏడాదే చివరిసారి

Khairatabad Ganesh : ఖైరతాబాద్‌ గణేశుడి నిమజ్జనం పూర్తి, ఈ ఏడాదే చివరిసారి.. వచ్చేసారి పూర్తిగా మారనున్న ప్రక్రియ
Caption: 
twitter image
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

ట్యాంక్‌బండ్‌పై చివరి పూజల తర్వాత మహాగణపతి నిమజ్జనం పూర్తి

భారీ ట్రాలీపై కొనసాగిన ఖైరతాబాద్‌ గణేషుని ఊరేగింపు
 

హుస్సేన్‌సాగర్‌‌ నిమజ్జనం ఇదే చివరిసారి

Mobile Title: 
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌ గణేశుడి నిమజ్జనం పూర్తి, వచ్చేసారి ఇలా ఉండదు
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Sunday, September 19, 2021 - 17:02
Request Count: 
118
Is Breaking News: 
No