Rain Alert: పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో ఉత్సాహంగా ఉన్న తెలంగాణ కమలనాధులకు కలవరపడే వార్త చెప్పింది వాతావరణ శాఖ. తెలంగాణలో రాబోయే మూడు రోజులు వర్షాకు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది బీజేపీ. ప్రధాని మోడీ సహా బీజేపీ అగ్రనేతలు పాల్గొనే ఈ సభకు దాదాపు 10 లక్షల మందిని సమీకరించే ప్రయత్నాలు చేస్తోంది తెలంగాణ బీజేపీ. నియోజకవర్గాల వారీగా ఇంచార్జులను నియమించి జనసమీకరణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం వర్షం వస్తే బహిరంగ సభకు ఇబ్బందులు వస్తాయని కమలం నేతలు ఆందోళన చెందుతున్నారు.
వాతావరణ శాఖ తాజాగా ఇచ్చిన నివేదిక ప్రకారం ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం బంగ్లాదేశ్ పరిసరాల్లో సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. సముద్ర మట్టం నుంచి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపునకు ప్రయాణిస్తోంది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో ఉత్తర ఒడిశా పరిసరాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. మరొక ఉపరితల ఆవర్తనము ఈశాన్య మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో కొనసాగుతూ ఉంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
శనివారం తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. ఆదివారం మరియు సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షములు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు రాష్ట్రంలో ఉరుములు మెరుపులుతో కూడిన వర్షం కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంది. శుక్రవారం రాత్రి గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో భారీ వర్షం కురిసింది. ఆదివారం వర్షం కురిస్తే పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న బహిరంగ సభకు ఆటంకాలు కల్గవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు తెలంగాణ బీజేపీ నేతలు.
Read also: CM Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలి!.. రామ్ సినిమా ఈవెంట్లో బ్యానర్లు
Read also: CM Kcr on PM Modi: ప్రధానిలా కాకుండా సేల్స్‌మెన్‌లా పనిచేస్తున్నారు..మోదీపై సీఎం కేసీఆర్ ఫైర్..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook