Telangana Rain Alert: తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలే.. హైదరాబాద్ కు ఐఎండీ అలర్ట్

Telangana Rain Alert:గత నాలుగైదు రోజులుగా హైదరాబాద్ సహా రాష్ట్రంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా వచ్చే మూడు రోజుల వరకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ.ఉరుములు మరియు మెరుపులతో  కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.

Written by - Srisailam | Last Updated : Oct 10, 2022, 03:12 PM IST
  • తెలంగాణను వదలని వాన
  • మరో రెండు రోజులు వర్షం
  • హైదరాబాద్ లో ముసురు
Telangana Rain Alert: తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలే.. హైదరాబాద్ కు ఐఎండీ అలర్ట్

Telangana Rain Alert:  తెలంగాణను వదలడం లేదు వరుణుడు. గత నాలుగైదు రోజులుగా హైదరాబాద్ సహా రాష్ట్రంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా వచ్చే మూడు రోజుల వరకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ప్రస్తుతం ఉపరితల ద్రోణి  తమిళనాడు నుండి రాయలసీమ,తెలంగాణ,  విదర్భా  మీదుగా పశ్చిమ మధ్యప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9   కిలోమీటర్ ఎత్తు వరకు కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు చాలా చోట్ల  కురిసే  అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు మరియు మెరుపులతో  కూడిన వర్షాలు అక్కడక్కడ చాలా జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది.

సోమవారం  ఆదిలాబాద్,నిర్మల్,నిజామాబాద్,కరీంనగర్,పెద్దపల్లి,జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం ఆదిలాబాద్,నిర్మల్,నిజామాబాద్,  వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి.

సోమవారం ఉదయం నుంచి పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో మోసర్తు నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనూ వర్షం కురిసింది. హైదరాబాద్ లోనూ ఆకాశం మేఘావృతమై ఉంది. పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు వరంగల్ జిల్లా దుగ్గండిలో అత్యధికంగా 116 మిల్లిమీటర్ల వర్షం కురిసింది, వికారాబాద్ జిల్లా తాండూరులో 68, కామారెడ్డి జిల్లా సోమూరులో 64, జనగామ జిల్లా కలకొండలో 59, ములుగు జిల్లా లక్ష్మిదేవిపేటవో 55 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.

Read also: Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో నెక్స్ట్ అరెస్ట్ కేసీఆర్ ఫ్యామిలీ నుంచేనా? బోయినపల్లి అభిషేక్ కు మూడు రోజుల కస్టడీ..

Read also: MS Dhoni into film industry:సినీ ఇండస్ట్రీలోకి ధోని ఎంట్రీ.. ఆ సినిమాలతో బడా ప్లాన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News