Rain alert: తెలంగాణలో మరో మూడు రోజులుపాటు భారీ వర్షాలు..!

Rain alert: మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ప్రకటన రిలీజ్ చేసింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 1, 2023, 07:11 PM IST
Rain alert: తెలంగాణలో మరో మూడు రోజులుపాటు భారీ వర్షాలు..!

Telangana Rain alert: తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర ప్రకటన విడుదల చేసింది. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాకుండా సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. మరికొన్ని జిల్లాల్లో 30 నుంచి 40 కిమీ వేగంతో గాలులు వీస్తాయని ప్రకటనలో వివరించింది. ఈనేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. బయటకు వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 

ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరాన్ని వడగళ్ల వాన బెంబేలెత్తించింది. తాజాగా మరోసారి వాతారణ శాఖ రెయిన్ అలర్ట్ ప్రకటించడం నగరవాసుల్లో ఆందోళన కలిగిస్తుంది. తాజాగా ఏర్పడిన ద్రోణి పశ్చిమ విదర్భ నంచి మరట్వాడ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ ఇంటరియర్ కర్ణాటక వరకు వ్యాపించి ఉంది. ఇది సముద్ర మట్టానికి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. 

మరోవైపు ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలుల, వడగళ్లతో కూడిన వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈమేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 

Also Read: Chandrababu naidu and Pawan kalyan meeting: చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భేటీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News