IIT Hyderabad Corona: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ భయాందోళనలో కూరుకుపోయాయి. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో కరోనా మూడో వేవ్ దేశంలో ప్రారంభమైనట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాలు ఆంక్షల్లో జారుకున్నాయి.
ఇప్పుడు దేశంలో పలు రాజకీయ నాయకులు సహా పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ కొవిడ్ కేసులు నానాటికి పెరిగిపోతున్నాయి. తాజాగా ఐఐటీ హైదరాబాద్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఐఐటీ హైదరాబాద్‌లోని విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా 119 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.
విద్యార్థులకు స్వల్ప లక్షణాలు మినహా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని యాజమాన్యం వెల్లడించింది. వైరస్ సోకిన వారందరినీ ఐఐటీ హైదరాబాద్ వసతి గృహంలోనే ప్రత్యేకంగా ఐసోలేషన్ ఏర్పాటు చేసి.. చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉన్నామని.. గత కొన్నిరోజులుగా ఆన్లైన్ క్లాసులు మాత్రమే నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది.
వరంగల్ నిట్ లో కరోనా కలవరం
తెలంగాణలోని వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) లోనూ కరోనా వైరస్ కలవరం మొదలైంది. అందులోని స్టూడెంట్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
ఇటీవల క్రిస్మస్ వేడుకలకు ఇంటికెళ్లి వచ్చిన 200 మంది విద్యార్థులకు నిర్వహించిన కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో... నలుగురు విద్యార్థులు, అధ్యాపక బృందంలో ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. కరోనా కేసులు వెలుగుచూడటంతో వెంటనే ప్రత్యక్ష తరగతులను నిలిపివేశారు.
Also Read: Bandi Sanjay: కేసీఆర్‌ను జైలుకు పంపుడే.. సీఎంపై చర్యలకు కేంద్రం సిద్ధమవుతోందన్న సంజయ్
Also Read: Covid in Gandhi Hospital : గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం, సిబ్బందికి కోవిడ్ పాజిటివ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook