Smita Sabharwal: బంగారు గాజులు వేసుకుని వెళ్లా.. సివిల్స్ ఇంటర్వ్యూలో నన్ను అడిగిన ప్రశ్నలు ఇవే: స్మితా సబర్వాల్

Smita Sabharwal Interview: ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్‌ను సివిల్స్‌ ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడిగారు..? ఆమె చెప్పిన సమాధానాలు ఏంటి..? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత వెంటనే ఎందుకు కలవలేదు..? ఏమైనా విభేదాలు ఉన్నాయా..? జీ తెలుగు ఇంటరవ్యూలో స్మితా సబర్వాల్ అనేక విషయాలను పంచుకున్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Mar 13, 2024, 12:16 AM IST
Smita Sabharwal: బంగారు గాజులు వేసుకుని వెళ్లా.. సివిల్స్ ఇంటర్వ్యూలో నన్ను అడిగిన ప్రశ్నలు ఇవే: స్మితా సబర్వాల్

Smita Sabharwal Latest Interview: సివిల్స్ ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు..? చాలా మందికి వీటి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. తనును అడిగిన ప్రశ్నల గురించి సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ జీ తెలుగు న్యూస్ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. తనను ఫారెన్ సర్వీసెస్‌కు సంబంధించి చాలా ప్రశ్నలు అడిగారని చెప్పారు. ఫారెన్ పాలసీ గురించి ఇంటర్వ్యూ బోర్డు ఎక్కువ ప్రశ్నలు వేసిందన్నారు. అదృష్టవశాత్తు తనకు ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో ఈజీగా సమాధానాలు చెప్పానని తెలిపారు. ఫారెన్ సర్వీసెస్‌కు తాను సరిపోతానని వాళ్లు చెక్ చేశారని అన్నారు. ఒకటి రెండు ప్రశ్నలు ఎకనామిక్స్, బ్యాంకింగ్ నుంచి అడిగారని చెప్పారు. 

Also Read: KCR Speech: టీవీ ముందు కూర్చుంటా.. రేవంత్‌ రెడ్డి తాట తీస్తా: కేసీఆర్‌ సంచలన ప్రకటన

"నన్ను 12 ప్రశ్నలు అడిగారు. 6, 7 ప్రశ్నలకు బాగా ఆన్సర్ చేశా. నేను బంగారు గాజులు వేసుకుని ఇంటర్వ్యూకు వెళ్లా. వాటిని చూసి గోల్డ్‌కు సంబంధించి ప్రశ్నించారు. గోల్డ్ ప్యూరిటీకి స్టాండర్డ్ ఏంటని అడిగారు. నాకు తెలియదని చెప్పాను. మనకు తెలిస్తే ఊహించాలి. కానీ ఏ మాత్రం తెలియకుండా ఊహిస్తే తెలిసిపోతుంది. అందుకే నాకు తెలియదు సార్ అని చెప్పాను. వాళ్లు గెస్ చేసి చెప్పమని అడిగారు. అయినా నాకు తెలియదనే చెప్పా. 3, 4 ప్రశలకు నేను సమాధానాలు చెప్పలేదు. సబ్జెక్ట్‌ గురించి తెలియనప్పుడు ఊహించి చెప్పకూడదు.

 

నేను క్లియర్ చేస్తానని వెళ్లలేదు. ఇంటర్వ్యూకు ఓపెన్ మైండ్‌తో వెళ్లా. నేను సివిల్స్ క్లియర్ చేసినా లేకున్నా పర్లేదు. ఇక్కడి వరకు రావాడం చాలా ఎక్కువని వెళ్లాను. ఈ ప్రశ్న మీదే నా జీవితం మొత్తం ఆధారపడి ఉంది అని నేను ఒత్తిడి తీసుకోలేదు. మెయిన్ ఇంటర్వ్యూకు ముందు రెండు మాక్ ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాను. మొత్తం అకాడమీక్ ప్రశ్నలు అడిగారు.." అని తన సివిల్స్ ఇంటర్వ్యూ గురించి చెప్పుకొచ్చారు.

సీఎం రేవంత్ రెడ్డిని కలవలేదని వస్తున్న విమర్శలపై స్మితా స్పందించారు. నేను ఐఏఎస్ ఆఫీసర్. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఎలాంటి అవసరం లేకున్నా కొన్ని ప్రచారాలు జరుగుతుంటాయి. ఇలాంటి ప్రచారాలు మంచిది కాదు. ఐఏఎస్ ఆఫీసర్లకు సిస్టమ్‌లో ఒక లిమిటెడ్ రోల్ ఉంది. నేను రూల్స్ ప్రకారమే వెళ్తా. కొత్త సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పుడు నేను సెక్రటరీగా లేను. ముఖ్యమంత్రిని కలిసేందుకు సరైన కారణం కోసం వెయిట్ చేశా. ఫైనాన్స్ కమిషన్‌కు సంబంధించిన విషయాలు ముఖ్యమంత్రికి వివరించాను. ప్రతి సమస్యను చాలా ఓపిగ్గా విన్నారు. మీరు మంచి పనిచేయాలని నన్ను ఎంకరేజ్ చేశారు. నేను అడిగిన వాటికి సీఎంగా వెంటనే రియాక్ట్ అయ్యారు.." అని స్మితా సబర్వాల్ చెప్పుకొచ్చారు. 

Also Read: Mahesh Babu: తొలిసారి మహేశ్ బాబు డ్యూయల్ రోల్..! ఇండస్ట్రీలో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News