Jagga Reddy with Jeevan Reddy: జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి మధ్య ఆసక్తికరమైన సంభాషణ

Jagga Reddy with Jeevan Reddy: హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులకు, ఫోటో జర్నలిస్టులకు ఇండ్లు, కార్లు, ప్లాట్లు ఇవ్వాలని అధికార పార్టీని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో పని చేస్తున్న జర్నలిస్ట్‌లతో పాటు రాష్టవ్యాప్తంగా ఉన్న పాత్రికేయులు అందరికి ఇళ్లు, కార్లు ఇవ్వాలని అన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 14, 2022, 05:47 PM IST
  • అలా చేస్తే నేనే టీఆర్ఎస్ పార్టీలోకి వస్తానంటున్న జగ్గా రెడ్డి
  • జర్నలిస్టులకు ఇండ్లు, కార్లు, ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్
  • కాంగ్రెస్ పార్టీలో అందుకు చేరలేదని వెల్లడించిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి
Jagga Reddy with Jeevan Reddy: జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి మధ్య ఆసక్తికరమైన సంభాషణ

Jagga Reddy with Jeevan Reddy: హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులకు, ఫోటో జర్నలిస్టులకు ఇండ్లు, కార్లు, ప్లాట్లు ఇవ్వాలని అధికార పార్టీని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో పని చేస్తున్న జర్నలిస్ట్‌లతో పాటు రాష్టవ్యాప్తంగా ఉన్న పాత్రికేయులు అందరికి ఇళ్లు, కార్లు ఇవ్వాలని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఈ పని చేస్తే.. నాకు నేనుగానే టీఆర్ఎస్ పార్టీలో చేరుతా అని జగ్గా రెడ్డి వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. 
 
పాత్రికేయులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటే.. ఒక టర్మ్ ఎన్నికల్లోనూ పోటీ చేయనని జగ్గా రెడ్డి స్పష్టంచేశారు. ఎన్నికలకు దూరంగా ఉండే విషయంలో నా నియోజకవర్గ వర్గ ప్రజలకు, అనుచరులకు సమాధానం చెప్పుకునే బాధ్యత కూడా తనదేనని అన్నారు. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టీఆర్ఎస్ పార్టీని వీడాను కానీ టీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకతతోనో లేక కేసీఆర్‌పై వ్యతిరేకతతోనో కాదని జగ్గా రెడ్డి తేల్చిచెప్పారు. 

గతంలో తాను టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం చెబుతూ జగ్గా రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీపై తనకు అసంతృప్తి కానీ ఆగ్రహం కానీ లేవని చెప్పడంతో పాటు ఆ పార్టీలో చేరడానికి తనకి ఎలాంటి అభ్యంతరాలు లేవని పరోక్షంగా చెప్పడానికే జగ్గా రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ వద్ద అధికార పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి, జగ్గా రెడ్డికి మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణలో ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీపై, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై అసంతృప్తితో ఉన్న జగ్గా రెడ్డి టీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నట్టుగా గత కొద్ది రోజులుగా ఓ ప్రచారం నడుస్తోంది. దీనికితోడు తాజాగా జగ్గా రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆ ప్రచారానికి బలం చేకూర్చాయి. అయితే.. జర్నలిస్టులకు ఇళ్లు, కార్లు ఇస్తేనే తాను టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని జగ్గా రెడ్డి (Jagga Reddy News) చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమంత సీరియస్‌గా తీసుకుంటుందోనని సందేహించే వాళ్లు కూడా లేకపోలేదు.

Also read : Telangana Jobs: తెలంగాణలో మొదలు కానున్న ఉద్యోగాల జాతర, పోలీస్ శాఖ నుంచే ప్రారంభం

Also read : Radhe Shyam OTT Release: ఓటీటీకి ప్రభాస్ 'రాధేశ్యామ్'.... స్ట్రీమింగ్‌ ఎక్కడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News