Hyderabadi girl attacked : హైదరాబాద్‌లోని హస్తినాపురంలో ప్రేమోన్మాది చేతిలో దాడికి గురైన యువతి గురువారం(నవంబర్ 18) నవీన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయింది. 18 కత్తిపోట్లకు గురైన ఆ యువతికి 10 సర్జరీలు చేసినట్లు ఆసుపత్రి వైద్యులు (Doctors) వెల్లడించారు. నిపుణులైన వైద్య బృందం యువతి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆధునిక శస్త్ర చికిత్సలు అందించారని తెలిపారు. యువతి పూర్తిగా కోలుకోవడానికి మరో 3 నెలల సమయం పడుతుందన్నారు.
ఆసుపత్రి ఛైర్మన్ సుభాన్ రెడ్డి మాట్లాడుతూ... యువతి పొట్ట భాగంలో 18 కత్తిపోట్లు ఉన్నాయని చెప్పారు. రెండు రోజుల పాటు తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితురాలి పరిస్థితి విషమించిందన్నారు. యువతికి రక్తం ఎక్కించడంతో పాటు సకాలంలో అవసరమైన సర్జరీలు (Medical surgery) చేయడంతో ప్రాణాలు నిలబెట్టగలిగామని తెలిపారు. 18 కత్తిపోట్లకు గురైనప్పటికీ ఆ యువతి ప్రాణాలతో బయటపడటంతో ఆమెను మృత్యుంజయురాలిగా పేర్కొంటున్నారు.
బాధిత యువతిపై ఈ నెల 10న ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరధిలోని హస్తినాపురంలో దాడి జరిగింది. తనతో పెళ్లికి (Marriage) నిరాకరించిందనే కారణంతో బస్వరాజ్ అనే యువకుడు ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె శరీరంపై 18 కత్తిపోట్లు పొడిచాడు. వికారాబాద్ (Vikarabad) జిల్లాకు చెందిన బస్వరాజ్ తనను పెళ్లి చేసుకోవాలని కొన్నేళ్లుగా ఆ యువతిని వేధిస్తున్నాడు. ఎన్నిసార్లు ఆమె నో చెప్పినా... అదే పనిగా ఆమెను వేధిస్తూ వస్తున్నాడు.
Also Read: 'మూడు నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నాం': ప్రధాని మోదీ
ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఆ యువతికి మరో యువకుడితో నిశ్చితార్థం జరిగింది. దీంతో ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన బస్వరాజ్... హైదరాబాద్ హస్తినాపురంలో ఆమె ఉంటున్న హాస్టల్‌కు వెళ్లి దాడికి (Attack on girl) పాల్పడ్డాడు. కత్తితో దాడి చేయడంతో పాటు పిడిగుద్దులు కురిపించాడు. బాధితురాలిని స్థానికులు వెంటనే హస్తినాపురంలోని నవీన ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో ఆమె కడుపులో ఇంటర్నల్ బ్లీడింగ్‌ను గుర్తించామని... దాన్ని కంట్రోల్ చేస్తున్నామని వైద్యులు చెప్పారు. ఎట్టకేలకు దాదాపు 10 రోజుల తర్వాత బాధిత యువతి మృత్యువును జయించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook