Drunk & Drive Fine: మందుబాబులకు శుభవార్త.. రూ.10వేలు కాదు కేవలం రూ.2 వేలు మాత్రమే! లిమిటెడ్ ఆఫర్

Hyderabad Drunk and Drive Fine: హైదరాబాద్ నగరంలోని మందుబాబులకు శుభవార్త. గతంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ (డీడీ)లో పట్టుబడిన వారు ఇప్పుడు రూ. 10 వేల జరిమానా కట్టాల్సిన అవసరం లేదు.. కేవలం రూ. 2 వేలు చెల్లిస్తే సరిపోతుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 23, 2022, 06:05 PM IST
  • మందుబాబులకు శుభవార్త
  • రూ.10వేలు కాదు కేవలం 2 వేలు మాత్రమే
  • లిమిటెడ్ ఆఫర్
Drunk & Drive Fine: మందుబాబులకు శుభవార్త.. రూ.10వేలు కాదు కేవలం రూ.2 వేలు మాత్రమే! లిమిటెడ్ ఆఫర్

Hyderabad traffic police reduces Drunk and Drive Fine: హైదరాబాద్ మహా నగరంలోని మందుబాబులకు శుభవార్త అందింది. గతంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ (డీడీ)లో పట్టుబడిన వారు ఇప్పుడు రూ. 10 వేల జరిమానా కట్టాల్సిన అవసరం లేదు.. కేవలం రూ. 2 వేలు చెల్లిస్తే సరిపోతుంది. మందుబాబులు ఇప్పుడు 2 వేల జరిమానా చెల్లించి వారిపై ఉన్న పెండింగ్‌ కేసులకు చెక్ పెట్టవచ్చు. హైదరాబాద్ మహా నగరంలో గత ఐదు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న వేల కేసులన్నింటిని పరిష్కరించే దిశగా న్యాయస్థానం ఈ మేరకు చర్యలు తీసుకుంది. అయితే ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. వివరాల్లోకి వెళితే... 

దేశ వ్యాప్తంగా మద్యం అమ్మకాల్లో తెలంగాణ రాష్ట్రం కూడా టాప్ జాబితాలో ఉన్న విషయం తెలిసిందే. ప్రతిరోజు భారీ స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహా నగరంలో. మద్యం మత్తులో కొందరు వాహనాలు నడుపుతూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. దాంతో గత నాలుగు ఐదు సంవత్సరాలుగా ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ (డీడీ)లను నగరంలో భారీగా నిర్వహిస్తున్నారు. వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఇందులో యువత ఎక్కువగా ఉంది. అతివేగం, మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేయడమే ప్రమాదాలకు దారితీస్తోంది.

ప్రమాదాలను నివారించేందుకు తెలంగాణ సర్కార్ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ జరిమానాను భారీగా పెంచింది. డీడీలో పట్టుబడితే రూ. 10 వేల జరిమానా కట్టాల్సి వస్తుంది. ఇది చాలా మందికి భారంగా మారింది. భారీ జరిమానాలకు బయపడిన చాలా మంది కోర్టులకు హాజరు కాలేకపోతున్నారు. దాంతో ఈ 2-3 ఏళ్లలో హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో సుమారు 70 వేలకు పైగా డీడీ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌కు సంబంధించిన పెండింగ్‌ కేసుల పరిష్కారంపై న్యాయస్థానం దృష్టి సారించింది. సత్వర పరిష్కారం కోసం ఇప్పటివరకు విధించిన జరిమానాలను రూ.10 వేల నుంచి రూ.2 వేలకు (ద్విచక్ర వాహనాలకు, ఆటోలకు 25% చెల్లిస్తే, మిగిలిన 75% పెండింగ్‌లో ఉన్న చలాన్లు మాఫీ చేయబడతాయి) తగ్గించింది. అయితే 2021 డిసెంబర్‌ 31 వరకు పెండింగ్‌లో ఉన్న డీడీ కేసులకు మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది. ఇదివరకు భారీ జరిమానాలతో భయపడిన చాలా మంది తమ కేసుల పరిష్కారం కోసం ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లకు క్యూ కడుతున్నారట. ఈ ఆఫర్ మార్చి 1 నుంచి 31 వరకు మాత్రమే ఉండటంతో.. డీడీ బాధితులు చాలా మంది ముందుకొస్తున్నారని హైదరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు అంటున్నారు. 

Also Read: Kalavathi Song: డాన్స్ మాస్టర్‌తో మ్యూజిక్ డైరెక్టర్ స్టెప్పులు.. పోలా అదిరిపోలా (వీడియో)!!

Also Read: గొప్ప మనసు చాటుకున్న టీమిండియా క్రికెటర్.. బాలుడి శస్త్ర చికిత్స కోసం రూ.31 లక్షల విరాళం!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News