హైదరాబాద్: మైనర్లు బైక్ నడిపితే.. పేరెంట్స్ జైలుకే

మద్యం తాగి వాహనాలు నడిపినా, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా ట్రాఫిక్ పోలీసులు తొలుత జరిమానాలు విధించేవారు.

Last Updated : May 21, 2018, 08:42 PM IST
హైదరాబాద్: మైనర్లు బైక్ నడిపితే.. పేరెంట్స్ జైలుకే

మద్యం తాగి వాహనాలు నడిపినా, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా ట్రాఫిక్ పోలీసులు తొలుత జరిమానాలు విధించేవారు. కానీ ఇకపై ట్రాఫిక్ రూల్స్ మారనున్నాయ్..! మైనర్లు వాహనాలు నడిపితే జరిమానాలు ఉండవని, నేరుగా వాళ్ల పేరెంట్స్‌కి జైలుశిక్ష తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చలానాలు విదిస్తున్నా మార్పు లేకపోవడంతో నేరుగా తల్లిదండ్రులపై చర్యలకు ఉపక్రమించారు ట్రాఫిక్ పోలీసులు. మైనర్ల వల్ల హైదరాబాద్‌లో గత 2 నెలల్లో 26 మంది తల్లిదండ్రులు జైలుపాలయ్యారు.

18 ఏళ్లలోపు వయసున్న వారు వాహనాలు నడపడం వల్ల వారికి, ఎదురుగా వచ్చేవాహనదారులకూ ప్రమాదకరమే. డ్రైవింగ్‌ లైసెన్సు లేకపోవడం, ట్రాఫిక్‌ నిబంధనలు తెలియకపోవడం, వాహనాలపై పూర్తిస్థాయి నియంత్రణ లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కనుక తల్లిదండ్రులు మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలివ్వొద్దని ట్రాఫిక్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

  • 2016లో 2,722 కేసులు నమోదవ్వగా.. రూ.7.23 లక్షల జరిమానాలు వసూలు చేశారు.
  • 2017లో 3,651 కేసులు నమోదుకాగా.. రూ.11.7 లక్షలు వసూలు చేశారు.
  • ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు 1,343 కేసుల నమోదు కాగా.. రూ.2.03 లక్షలు వసూలు చేశారు. కేవలం నాలుగు నెలల్లోనే 1,343 కేసులు నమోదుకాగా.. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో 26 మందిని జైలుకు పంపించారు పోలీసులు.

Trending News