Hydra: సీఎం రేవంత్ మరో సంచలనం.. ఇకపై హైడ్రా NOC ఇస్తేనే భవన నిర్మాణాలు ..?..డిటెయిల్స్ ఇవే..

Cm Revanth reddy on hydra: ఇక మీదట హైడ్రా.. కొత్త నిర్మాణాలకు ఎన్ఓసీలు ఇస్తుందని కూడా వార్తలు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు సీఎం రేవంత్ కూడా దీనిపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

Written by - Inamdar Paresh | Last Updated : Sep 11, 2024, 10:49 AM IST
  • తెలంగాణలో కొనసాగుతున్న హైడ్రా దూకుడు..
  • కొత్తగా ఇళ్లను కొంటున్న వారికి అలర్ట్..
 Hydra: సీఎం రేవంత్ మరో సంచలనం.. ఇకపై హైడ్రా NOC ఇస్తేనే భవన నిర్మాణాలు ..?..డిటెయిల్స్ ఇవే..

Special powers to hydra demolishes: తెలంగాణలో  ఎక్కడ చూసిన ప్రస్తుతం హైడ్రా హల్ చల్ చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కాన్సెప్ట్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చెరువులు, బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలోని.. అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేతలు చేస్తుంది. ఈ క్రమంలో..తాజాగా, హైడ్రా బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలోని.. ఇప్పటికే కట్టిన నిర్మాణాలు కూల్చివేతలు చేయమని, ఇక మీదట కొత్తగా కట్టిన నిర్మాణాలను మాత్రం కూల్చివేస్తామంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు.

దీనిపై ఒకవైపు అపోసిషన్ పార్టీలు గగ్గొలు పెడుతున్న కూడా..  హైడ్రా హల్ చల్ మాత్రం ఆగడంలేదు. ఇదిలా ఉండగా.. హైడ్రా కు ఇటీవల సీఎం రేవంత్.. ప్రత్యేకంగా పోలీసు అధికారుల్ని  సైతం కేటాయించారు. 15 సీఐ స్థాయి అధికారులు, 8 మంది ఎస్ ఐ స్థాయి పోలీసు అధికారులను కేటాయించింది. ఈ మేరకు డిప్యూటేషన్ ఆదేశాలు ఇస్తూ డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

వీకెంట్ వచ్చిందంటే చాలు.. హైడ్రా దూకుడు నడుస్తోంది. అంతేకాకుండా.. అక్రమ నిర్మాణా దారుల కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు.  నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన తర్వాత హైడ్రా పేరు ఒక్కసారిగా రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలను  క్రియేట్ చేసింది. మరోవైపు అమాయకులు.. మాత్రం తాము అన్నిరకాల సర్టిఫికెట్లు చెక్ చేసుకున్న తర్వాత..  నిర్మాణాలు కొనుగోలు చేశామని కానీ.. ఇప్పుడు మాత్రం అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేస్తున్నారని కూడా బాధితులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు  ఇక మీదట కొత్తగా ఇళ్లను కొనుగోలు చేసేవారు, చెరువులు, నాలాలకు సమీపంలో.. ఉన్నభవన నిర్మాణాలను కొనుగోలు నిర్మాణాలకు హైడ్రా  ఎన్ఓసీ అనుమతి తప్పనిసరి చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల కొనుగోలు దారులకు సైతం..దీనిపైన భరోసా ఉంటుందని తెలుస్తోంది. హైడ్రా ఇచ్చిన ఎన్ఓసీనే బేస్ గా చేసుకుని..  మిగతా డిపార్ట్ మెంట్ లు.. ఇంటి నంబర్, నల్లా, విద్యుత్ కనెక్షన్లను  సైతం ఇస్తారనే విషయంపైన కూడా అధికారులు చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.

Read more: Viral Video: పట్టాల మీదకు వచ్చి గుర్రుగా నిద్రపోయిన యువతి.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు.. వీడియో..

ముఖ్యంగా.. దీని వల్ల చెరువుల పరిరక్షణ లక్ష్యం సక్సెస్ అయ్యిందని వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి.  ప్రస్తుతం మాత్రం రెండు తెలుగు స్టేట్స్ లలో కొత్తగా ఇళ్లు కొంటున్న వారు.. ఒకటికి పదిసార్లు.. చెరువుల పరిధిలో లేదా నాలా పరిధిలో ల్యాండ్ ఏమైనా.. ఉందా అని.. అనేక రకాలుగా స్థానికులను అడిగి మరీ తమ అనుమానాలను క్లియర్ చేసుకుంటున్నారంట.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News