హైదరాబాద్ రోహింగ్యాలకు అడ్డాగా మారింది: బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి

హైదరాబాద్ ప్రాంతానికి శరణార్థులమని చెప్పుకుంటూ అనేకమంది రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు వస్తున్నారని బీజేపీ నేత జి. కిషన్ రెడ్డి తెలిపారు.

Last Updated : Aug 4, 2018, 07:09 PM IST
హైదరాబాద్ రోహింగ్యాలకు అడ్డాగా మారింది: బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి

హైదరాబాద్ ప్రాంతానికి శరణార్థులమని చెప్పుకుంటూ అనేకమంది రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు వస్తున్నారని బీజేపీ నేత జి. కిషన్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని ఆయన కోరారు. "హైదరాబాద్ నగరంలోని బర్మా కాలనీ, బాలాపూర్ దర్గా, పహాడి షరీఫ్, హఫీజ్ బాబానగర్, కిషన్ బాగ్ నగర్ లాంటి ప్రాంతాల్లో అనేకమంది రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు ఎంఐఎం పార్టీ సహాయంతో నివసిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వీరికి పాతబస్తీ లాంటి ఏరియాలు రెగ్యులర్ అడ్డాలుగా మారాయి. వీరిలో చాలా మంది దొంగ పాస్ పోర్టులు, ఆధార్ కార్డులు కూడా కలిగున్నారు. వీరు శరణార్థులు కాదు.. నేరస్తులు. వీరిపై తెలంగాణ ప్రభుత్వం నిఘా పెట్టాలి" అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఒక్క హైదరాబాద్‌లోనే కాదని.. తెలంగాణ, ఏపీల్లో కూడా రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు వివిధ ప్రాంతాలలో నివాసముంటున్నారని కిషన్ రెడ్డి అన్నారు. "విశాఖపట్నం లాంటి ప్రాంతంలో కూడా ఓ బంగ్లాదేశీయుడు ఈ దేశ పౌరుడిననని చెబుతూ మేయర్ పోస్టు కోసం ఎన్నికలలో నిలబడ్డాడు. పలు ఎన్జీఓలు కూడా ఇలాంటి వారికి మద్దతు పలుకుతున్నాయి. ఈ పద్ధతి మారాలి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి" అని కిషన్ రెడ్డి తెలిపారు. 

కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే కొన్ని వేలమంది రోహింగ్యాలు భారతదేశంలోకి అడుగుపెట్టారని కిషన్ రెడ్డి తెలిపారు. అస్సాంలో కూడా దాదాపు 40 లక్షలమంది వలసదారులు అక్రమంగా నివసిస్తున్నారని.. అలాగే మొత్తం భారతదేశంలో చూసుకుంటే ఇలాంటి వారు సంఖ్యాపరంగా 2 కోట్లమందికి పైగానే ఉంటారని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వలసదారులు, శరణారస్థులు భారతదేశానికి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాక.. మైనారిటీ హక్కుల కోసం పోరాడుతున్నారని.. ఇలాంటి విషయంలో ప్రభుత్వం విచక్షణ కనబరచాలని కిషన్ రెడ్డి తెలియజేశారు. 

Trending News