Video: హైదరాబాద్ లో దారుణం.. తలపై నుండి వెళ్లిన లారీ ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి

Hyderabad Road Accident: హైదరాబాద్ శివారులోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై కాలేజీకి వెళ్తున్న ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థినులను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 11, 2021, 03:27 PM IST
  • హైదరాబాద్ శివారులోని దుండిగల్ పరిధిలో రోడ్డు ప్రమాదం
  • స్కూటీని ఢీకొట్టిన లారీ ఢీకొట్టడంతో ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
Video: హైదరాబాద్ లో దారుణం.. తలపై నుండి వెళ్లిన లారీ ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి

Hyderabad Road Accident: హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై కాలేజీకి వెళ్తున్న ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థినులను (Engineering Students) లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందగా... మరో విద్యార్థిని తీవ్ర గాయాలపాలైంది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం (డిసెంబర్ 9) ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

స్కూటీపై వెళ్తున్న విద్యార్థినులను వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టడం (Scooty hits by Lorry) ఆ వీడియోలో గమనించవచ్చు. దీంతో స్కూటీపై ఉన్న ఇద్దరు లారీ చక్రాల కింద పడిపోయారు. ఇందులో ఒకరి తలకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. గాయపడ్డ మరొకరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతురాలిని మేఘన (20), గాయపడ్డ విద్యార్థిని సుమనశ్రీ (21)గా గుర్తించారు. ఈ ఇద్దరు దుండిగల్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నారు.

కాలేజీ ముగిసిన తర్వాత మేఘన, సుమనశ్రీ కలిసి స్కూటీపై కూకట్‌పల్లి వెళ్తుండగా గండిమైసమ్మ క్రాస్ రోడ్స్ వద్ద ఈ ప్రమాదం (Road Accident) చోటు చేసుకుందని స్థానిక పోలీసులు వెల్లడించారు. అక్కడికి రాగానే మేఘన స్కూటీ స్పీడ్ తగ్గించారని... అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టిందని చెప్పారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఇటీవలి కాలంలో హైదరాబాద్‌లో (Hyderabad) తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం బంజారాహిల్స్, నార్సింగి పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు.

Also Read: Nathan Lyon: ఒక్క వికెట్‌ కోసం 326 రోజుల నిరీక్షణ.. చివరకు మూడో బౌలర్‌గా రికార్డు!!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News