Padi Kaushik Reddy Fires on minister ponnam Prabhakar: తెలంగాణలో ప్రస్తుతం బ్లాక్ బుక్ మరో పోలిటికల్ హీట్ నడుస్తోంది. ఇప్పటికే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. తాము అవినీతికి పాల్పడుతున్న అధికారులు, మంత్రుల పేర్లను బ్లాక్ బుక్ లో రాస్తున్నామంటూ వ్యాఖ్యలు చేశారు. కొందరు కావాలని అధికారులు, అధికారంలో ఉన్న నాయకులకు ఫెవర్ గా పనిచేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ముఖ్యంగా పోలీసులు తమ అధికార పరిధికి లోబడి పనిచేయాలని చెప్పారు. కేవలం అధికారంలో ఉన్న నాయకుల మాటలు విని తమపై అక్రమంగా కేసులు పెట్టడం సరికాదన్నారు.
Read more: Pythons: కొండ చిలువలు ఒక మనిషిని ఎంత సేపట్లో మింగేస్తాయో తెలుసా..?
అంతేకాకుండా.. కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారు.ఫ్లై యాష్ కుంభకోణం, టికెట్ల కుంభకోణం చేయలేదని, తడిబట్టలతో వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చేదమ్ముందా అంటూ సవాల్ విసిరారు. ఇప్పటికే తాను ఎలాంటి మోసాలకు,అవినీతికి పాల్పడలేదని తడిబట్టలతో కౌశిక్ రెడ్డి హనుమాన్ విగ్రహంపై ప్రమాణం చేశారు.ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి.. ఫిల్మ్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంకు చేరుకున్నారు. అంతేకాకుండా.. మీడియా సమావేశంకూడా నిర్వహించారు.
ఈ సమావేశంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. మీడియా సాక్షిగా బ్లాక్ బుక్ మొదటి పేజీలో మంత్రి పొన్నం ప్రభాకర్ రాస్తున్నమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఐదేండ్ల తరువాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. అవినీతికి పాల్పడిన మంత్రులు, ఎమ్మెల్యేలు,అధికారుల పేర్లను బ్లాక్ బుక్ లో రాస్తున్నానంటున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వచ్చేఎన్నికలలో కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.
మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు వరుసగా కాంగ్రెస్ లోకి జంప్ అయిపోతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఇటీవల పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ లు కాంగ్రెస్ లో చేరడం మాత్రం తీవ్ర రచ్చగా మారింది. కాంగ్రెస్ నేతల ఈ చేరికలను తీవ్రంగా ఖండించారు. మరోవైపు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ పార్టీలో చేరడాన్ని బహిరంగంగా వ్యతిరేకించారు. తాను పార్టీకీ రాజీనామా చేస్తానంటూ కూడా సీరియస్ అయ్యారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని, కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీకి పిలిపించుకుని మరీ బుజ్జగిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి