Huzurabad By Election: బీజేపీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్

TRS complaint to election commission on BJP : ఓటర్లకు డబ్బులు పంచేందుకు బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేస్తున్నారంటూ టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం సభ్యులు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌కు ఫిర్యాదు చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 22, 2021, 07:09 PM IST
  • బీజేపీతో పాటు ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారికి టీఆర్ఎస్ ఫిర్యాదు
  • బ్యాంకు ఖాతాలు తెరిచి డబ్బు పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ఆరోపణ
Huzurabad By Election: బీజేపీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్

Huzurabad By Election TRS complaint to election commission on BJP and Eatala over money distribution : హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో బీజేపీతో పాటు ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ (Etala rajender) అక్రమాలకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ పేర్కొంది. ఓటర్లకు డబ్బులు పంచేందుకు బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేస్తున్నారంటూ టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం సభ్యులు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌కు (Shashank Goel) ఫిర్యాదు చేశారు. 

చాలా మంది పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిచి గూగుల్‌ పే, (Google pay) ఫోన్‌పేల ద్వారా ఓటర్లకు డబ్బు పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారంటూ న్నికల సంఘం ప్రధాన అధికారికి తెలిపారు. ఇక ఎన్నికల నోటిఫికేషన్‌ (Election Notification‌) వచ్చాక కూడా బీజేపీ నేతలు కేంద్రమంత్రితో హుజూరాబాద్‌ (Huzurabad) పక్క నియోజకవర్గంలో సమావేశం పెట్టారని పేర్కొన్నారు.

Also Read : Amarinder Singh : పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు ఐఎస్ఐతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు

ఇక ఇప్పుడు మాత్రం సీఎం కేసీఆర్‌ (CM KCR) సభ పెడతామంటే ఈసీ (EC) ఆంక్షలు పెడుతోందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీజేపీ (BJP) ప్రభావితం చేస్తున్నట్టు కనిపిస్తోందని టీఆర్ఎస్ (TRS) పార్టీ ప్రతినిధి బృందం సభ్యులు పేర్కొన్నారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ను కోరారు.

Also Read : TS Eamcet: ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News