Husband Stabs Wife Boyfriend : భార్య ప్రియుడిని కత్తితో పొడిచిన భర్త

 Husband Stabs Wife Boyfriend :చందర్, భార్య లక్ష్మి, తన నలుగురు పిల్లలతో కలిసి నాగంపల్లి తండాలో కూలి పనులు చేసుకుంటూ బతికేవారు. కొన్ని రోజులుగా భార్య లక్ష్మి... తలాబ్‌తండాకు చెందిన రాందాస్‌ (Ramdas‌) అనే యువకుడి ప్రేమయాణం మొదలుపెట్టింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2021, 01:06 PM IST
  • బాయ్ ఫ్రెండ్‌ ప్రాణాల మీదకు వచ్చిన వివాహిత ప్రేమ వ్యవహారం
  • కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో ఘటన
  • ప్రియుడితో కలిసి ఉంటానంటోన్న భార్య
Husband Stabs Wife Boyfriend : భార్య ప్రియుడిని కత్తితో పొడిచిన భర్త

Husband Stabs Wife Boyfriend In Telangana Kamareddy district Nagampalli tanda in the Pitlam Mandal: ఒక వివాహిత ప్రేమ వ్యవహారం ఆమె బాయ్ ఫ్రెండ్‌ ప్రాణాల మీదకు వచ్చింది. ఆమె భర్త... దాడి చేయడంతో బాయ్​ ఫ్రెండ్ (Boyfriend) తీవ్రంగా గాయపడి ఆస్పత్రిపాలయ్యాడు. 

కామారెడ్డి జిల్లా (Kamareddy district) పిట్లం మండలంలోని (Pitlam Mandal) నాగంపల్లితండాకు చెందిన చందర్‌కు, కాస్లాబాద్‌తండాకు చెందిన లక్ష్మితో (Lakshmi) 15 ఏళ్ల కిందటే పెళ్లి అయ్యింది. అయితే చందర్, భార్య లక్ష్మి, తన నలుగురు పిల్లలతో కలిసి నాగంపల్లి తండాలో కూలి పనులు చేసుకుంటూ బతికేవారు. కొన్ని రోజులుగా భార్య లక్ష్మి... తలాబ్‌తండాకు చెందిన రాందాస్‌ (Ramdas‌) అనే యువకుడి ప్రేమయాణం మొదలుపెట్టింది.దీంతో తాజాగా రాందాస్‌ నాగంపల్లితండాలోని లక్ష్మిని కలిసేందుకు వెళ్లాడు. అయితే భర్త చందర్, (Chander) కుటుంబసభ్యులు గమనించి రాందాస్‌ను బెదిరించి పంపించారు. 

Also Read :10 digit Mobile Number: అవును.. ఫోన్ నంబర్ 10 అంకెలు మాత్రమే ఎందుకు ఉంటుంది..??

అయితే లక్ష్మి మాత్రం తన పిల్లలతో కలిసి పిట్లం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. తన భర్త చందర్‌తో ఉండనని తేల్చి చెప్పేసింది. రాందాస్‌తోనే ఉంటానంటూ చెప్పింది. రాందాస్, లక్ష్మి స్టేషన్‌లోనే చాలా సేపు ఉన్నారు. తర్వాత రాందాస్‌ కానిస్టేబుల్‌ను (Constable‌) వెంట తీసుకొని ఓ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు వెళ్లాడు. అక్కడ లక్ష్మి భర్త చందర్‌ కత్తితో రాందాస్‌పై కత్తితో దాడి చేశాడు. తల, ఛాతి, కడుపుపై మూడు కత్తి పోట్లు పొడిచాడు. వెంటనే కానిస్టేబుల్, స్థానికుల సహాయంతో చందర్‌ని పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు (Police Station‌) తీసుకొచ్చారు. బాధితుడు రాందాస్‌ను చికిత్స నిమిత్తం పిట్లం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. కేసు (Case) దర్యాప్తులో ఉంది.

Also Read :NBK 107 Movie: మాస్ కాంబినేషన్ షురూ.. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమా స్టార్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News