బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారనుంది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతం కానుంది. ఫలితంగా ఏపీలో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలో కూడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా రానున్న 36 గంటల్లో వాయుగుండంగా మారనుంది. కొన్ని జిల్లాలో మోస్తరు వర్షాలు, మరి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. అదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఇక నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, గద్వాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
మొత్తానికి 9 జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. 13 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఉరుములు, మెరుపులతో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. అటు హైదరాబాద్‌లో ఉదయం నుంచి వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. బంజారాహిల్స్, లక్డీకాపూల్, నాంపల్లి, కోఠి, అమీర్ పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, మెహిదీపట్నం, మలక్ పేట్, దిల్‌సుఖ్ నగర్, హయాత్ నగర్, వనస్థలిపురంలో వర్షాలు పడుతున్నాయి.
Also read: IMD Heavy Rains Alert: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, ఏపీ అంతా అతి భారీ వర్షాలు , తస్మాత్ జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.