Hyderabad Central University: సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం.. థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారాయత్నం!

Hyderabad Central University Professor attempted to rape Student. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారాయత్నం చేశాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 3, 2022, 11:54 AM IST
  • సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం
  • థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారాయత్నం
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు
Hyderabad Central University: సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం.. థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారాయత్నం!

HCU Hindi Professor attempted to rape Thailand student: గత కొంత కాలంగా హైదరాబాద్ నగరంలో వరుస రేప్ ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. రొమేనియన్ బాలికపై జూబ్లీహిల్స్‌లో సామూహిక గ్యాంగ్ రేప్ ఘటన పెద్ద సంచలనంగా మారింది. ఈ ఘటన ముందే నగరంలోని ప్రగతినగర్‌లో ఒక యువతిపై సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అత్యాచారం చేసారు. తాజాగా మరో కీచక ఘటన జరిగింది. సెంట్రల్ యూనివర్సిటీలో థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారాయత్నం చేశాడు. 

వివరాల ప్రకారం... థాయిలాండ్‌కి చెందిన విద్యార్థిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో చదువుతోంది. ఆమె  హిందీ డిపార్ట్మెంట్‌లో స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ చదువుతోంది. అదే డిపార్ట్మెంట్‌కు ప్రొఫెసర్ రవి రంజన్ హిందీ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు. ప్రొఫెసర్ రవి థాయిలాండ్‌ విద్యార్థినిపై ఎప్పటి నుంచో కన్నేశాడు. అవకాశం కోసం ఎదురుచూస్తునాడు. 

ప్రొఫెసర్ రవి రంజన్.. బుక్ కోసం థాయిలాండ్‌ విద్యార్థినిని క్యాంపస్ బయటికి పిలిచి అత్యాచారం చేయబోయాడు. అయితే విద్యార్థిని తృటిలో తప్పించుకొని అక్కడి నుంచి పారిపోయింది. విషయం తన స్నేహితులకు చెప్పి.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న (354 ఐపీసీ కింద) పోలీసులు ప్రొఫెసర్ రవి రంజన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: Gold Coins: పైపులైన్‌ కోసం తవ్వుతుండగా.. బయటపడ్డ బంగారు నాణేలు! షాక్‌లో యజమానులు

Also Read: Gold Price Today: మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర! వరుసగా నాలుగో రోజు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

 

Trending News