Harish Rao demands apology from Piyush Goyal: కేంద్రమంత్రి పీయుష్ గోయల్ తక్షణమే తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రుల బృందాన్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని మండిపడ్డారు. పీయుష్ గోయల్ వ్యాఖ్యలు యావత్ తెలంగాణ ప్రజలను, ఇక్కడి రైతులను అవమానించడమేనని అన్నారు. గోయల్ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పి తీరాలన్నారు.
రాష్ట్రంలోని 70లక్షల మంది తరుపున మంత్రుల బృందం ఢిల్లీకి వస్తే... మీకేమీ పని లేదా అని పీయుష్ గోయల్ మాట్లాడటం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని హరీష్ రావు ఫైర్ అయ్యారు. రైతు కుటుంబాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా పీయుష్ గోయల్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ఢిల్లీలో తెలంగాణ మంత్రుల బృందం 3 రోజులుగా పీయుష్ గోయల్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తే సమయం లేదని చెప్పారని... అదే సమయంలో బీజేపీ నేతలకు అపాయింట్మెంట్ ఇచ్చారని హరీష్ రావు అన్నారు. దీన్నిబట్టి కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతలేంటో ప్రజలకు అర్థమవుతోందన్నారు.
కేంద్రం రాష్ట్రంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇప్పటికే 40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ (Paddy Procurement) పూర్తయిందన్నారు. అదనంగా మరో 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందని... దానిపై లిఖితపూర్వక హామీ కోసం మంత్రులు కేంద్రమంత్రి వద్దకు వెళ్లారని పేర్కొన్నారు. వరి ధాన్యం కొనుగోలుపై రాజకీయం చేస్తున్నది తాము కాదని... కేంద్రమే దీనిపై రాజకీయం చేస్తోందని విమర్శించారు. అదనపు ధాన్యాన్ని కొనుగోలు చేస్తారా చేయరా.. యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తారా చేయరా... ఈ అంశాలపై తేల్చకుండా పీయుష్ గోయల్ దీనిపై రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీయుష్ గోయల్ చెబుతున్నవన్నీ పచ్చి అబద్దాలని హరీష్ రావు (Harish Rao) విమర్శించారు. పంజాబ్‌లో కొన్నట్లు ఇక్కడ కూడా మొత్తం ధాన్యం కేంద్రమే కొనాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కేంద్రానికి చేతకాకపోతే వరి ధాన్యం సేకరణ, ఎగుమతులు, దిగుమతులపై అజమాయిషీని రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలన్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు, పంట పెట్టుబడి అందిస్తున్నామని... కానీ కేంద్రం మాత్రం తమ బాధ్యతను విస్మరిస్తోందని అన్నారు. మాట తప్పింది మీరు... మాట మారుస్తున్నది మీరు.. రాజకీయం చేస్తున్నది మీరంటూ పీయుష్ గోయల్‌పై హరీష్ రావు ఫైర్ అయ్యారు.
పీయుష్ గోయల్ ఏమన్నారంటే..:
తన అపాయింట్మెంట్ కోసం తెలంగాణ మంత్రులు శనివారం (డిసెంబర్ 18) నుంచి ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారని... నిజానికి వారిని ఆహ్వానించలేదని పీయుష్ గోయల్ (Piyush Goyal) అన్నారు. అంతేకాదు, మా పనుల్లో మేం బిజీగా ఉన్నాం... వారికేం పనిలేదా అని ప్రశ్నించారు. తాజాగా ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ మంత్రి హరీష్ రావు క్షమాపణ డిమాండ్ చేశారు.
Also Read: Omicron-Hiv: ఒమిక్రాన్ పుట్టుకపై తెరపైకి కొత్త థియరీ-హెచ్ఐవితో లింక్‌పై పరిశోధకుల అనుమానాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి