Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో సమాధి కలకలం-అసలు విషయం తేల్చిన పోలీసులు

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ హాస్టల్ వెనుక భాగంలో రాత్రికి రాత్రే ఓ సమాధి ప్రత్యక్షమవడం అక్కడి విద్యార్థులను భయాందోళనకు గురిచేసింది. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం తెలియడంతో స్టూడెంట్స్ ఊపిరి పీల్చుకున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 29, 2021, 06:58 PM IST
  • ఉస్మానియా క్యాంపస్‌లో సమాధి కలకలం
    ఇంజనీరింగ్ హాస్టల్ వెనుక భాగంలో సమాధి
    భయాందోళనకు గురైన క్యాంపస్ స్టూడెంట్స్
Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో సమాధి కలకలం-అసలు విషయం తేల్చిన పోలీసులు

Osmania University: హైదరాబాద్‌లోని (Hyderabad) ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో సమాధి కలకలం రేపింది. రాత్రికి రాత్రే ఆ సమాధి ప్రత్యక్షమవడంతో క్యాంపస్ విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఆదివారం (నవంబర్ 28) ఉదయం మార్నింగ్ వాక్‌కి వెళ్లిన విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీ (Osmania University Campus) హాస్టల్ వెనుక భాగంలో ఈ సమాధిని గుర్తించారు. దానిపై చల్లిన పూలు తాజాగా ఉండటంతో రాత్రే ఖననం చేసి ఉంటారని భావించారు.

ఆ సమాధిలో (Grave in Osmania University) మనిషి శవాన్ని పూడ్చి పెట్టారా లేక ఏదైనా జంతువును పూడ్చి పెట్టారా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఆ సమాధిని పరిశీలించిన అనంతరం... క్యాంపస్ పక్కనే ఉన్న బస్తీ వాసులను పోలీసులు దానిపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. పోలీసుల (Hyderabad Police) ప్రాథమిక దర్యాప్తులో చనిపోయిన ఓ కుక్కను అక్కడ పూడ్చిపెట్టినట్లు తేలింది.

బస్తీలో ఓ కుక్క చనిపోవడంతో.. దాని యజమానులు ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ వెనుక భాగంలో దాన్ని పూడ్చి పెట్టినట్లు స్థానిక వ్యక్తి ఒకరు పోలీసులకు వెల్లడించాడు. బస్తీలో పడేస్తే వాసన వస్తుందన్న ఉద్దేశంతో క్యాంపస్‌లోని ఖాళీ ప్రదేశంలో ఖననం చేసినట్లు చెప్పాడు. ఈ విషయం పోలీసులు విద్యార్థులకు చెప్పడంతో... అప్పటిదాకా టెన్షన్ పట్ట విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఉస్మానియా యూనివర్సిటీలోకి (Telangana) బయటి వ్యక్తుల రాకపోకలపై నియంత్రణ లేదు. దీంతో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వర్సిటీని తమ సెటిల్‌మెంట్లకు అడ్డాగా మార్చుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. కొంతమంది క్యాంపస్ గ్రౌండ్‌ను రాత్రి పూట మందు సిట్టింగ్‌కు అడ్డాగా మార్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓయూ క్యాంపస్ గ్రౌండ్‌లో వాకింగ్ కోసం వచ్చే బయటి వ్యక్తులకు యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని ఇటీవలే వర్సిటీ అధికారులు నిర్ణయించారు. తద్వారా బయటి వ్యక్తుల రాకపోకలను నియంత్రించవచ్చునని భావిస్తున్నారు.

Also Read: Viral Video: పెళ్లాం కొట్టిందని పోలీస్ స్టేషన్‌లో వెక్కి వెక్కి ఏడ్చిన భర్త

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News