ఎంసెట్ ( Eamcet ) పరీక్షకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ( Telangana Government ) విద్యార్ధులకు శుభవార్త అందించింది. వెయిటేజీ నిబంధనను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. విద్యార్ధులందరికీ కౌన్సిలింగ్ అవకాశాన్ని కల్పించింది.
కరోనా వైరస్ ( Corona virus ) నేపధ్యంలో తెలంగాణ సహా దాదాపు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల్ని రద్దు చేసింది. పరీక్ష రాసినవారందర్నీ కనీస మార్కులు 35తో పాస్ చేసేసింది. ఈ నిర్ణయం ప్రభావం ఎంసెట్ కౌన్సిలింగ్ పై పడింది. ఎందుకంటే ఎంసెట్ అర్హత సాధించినా..కౌన్సిలింగ్ లో ఇంటర్ మార్కుల ఆధారంగా ర్యాంకింగ్ ఉంటుంది. అంటే ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఉంటుంది. ఇంటర్మీడియట్ లో కనీసం 45 శాతం మార్కులుంటేనే అడ్మిషన్ కు అర్హులవుతారు. దాంతో చాలామంది విద్యార్ధులు..ఎంసెట్ లో మంచి అర్హత సాధించినా..ఇంటర్మీడియట్ లో 45 మార్కులు లేక అనర్హులుగా నిలిచారు.
ఈ నేపధ్యంలో విద్యార్ధులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ( High court )..కౌన్సెలింగ్ నిలిపివేయాలని ఆదేశించింది. నిబంధనలు సవరిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. హైకోర్టుకు చెప్పిన విధంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెయిటేజీ నిబంధనను తొలగించి..కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త ఉత్తర్వుల నేపధ్యంలో ఎంసెట్ అర్హత సాధించినవారంతా ఇప్పుడు కౌన్సిలింగ్ కు అర్హత పొందారు.
తెలంగాణలో ఈ యేడాది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 4 లక్షల 11 వేల మంది విద్యార్ధులు హాజరు కాగా..1 లక్షా 75 వేల మంది ఉత్తీర్ణత సాధించారు. ఎంసెట్ కు కావల్సిన 45 శాతం మార్కులు లేనివారు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ద్వారా మార్కుల్ని పెంచుకునేవారు. సప్లిమెంటరీ రద్దు కావడంతో ఆ అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు వెయిటేజీ నిబంధనే తొలగించడంతో విద్యార్ధులు ఊపిరి పీల్చుకున్నారు. Also read: Kavitha: ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం