Ganesh Nimajjanam 2024: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో విషాదం.. లడ్డూ గెలిచి డాన్స్ చేస్తుండగా గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి..

Ganesh Nimajjanam 2024:  వినాయక నవరాత్రి ఉత్సవాల్లో  దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరగాల్సిన వినాయక ఉత్సవాలు అక్కడ కొన్ని విషాద ఘటనల నేపథ్యంలో కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నాయి.  అటు వంటి విషాదకర ఘటన  మణికొండ అల్కాపురి కాలనీలో జరిగింది. ఇక్కడ వినాయక ఉత్సవాల్లో అప్పటి వరకు ఎంతో ఉత్సాహాంగా పాల్గొన్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. గుండెపోటుతో మృతి చెందటంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 16, 2024, 01:40 PM IST
Ganesh Nimajjanam 2024: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో విషాదం.. లడ్డూ గెలిచి డాన్స్ చేస్తుండగా గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి..

Ganesh Nimajjanam 2024:  దేశ వ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు  భక్తులు ఎంతో ఆనందోత్సాహాల మధ్య సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంతేకాదు ప్రతి చోట లడ్డూ వేలం పాటలో భక్తులు పాల్గొంటున్నారు. అంతేకాదు ఆయా కాలనీల్లో లడ్డూ వేలం  లక్షల్లో పలుకుతోంది. తాజాగా హైదరాబాద్ మణికొండ అల్కాపురిలో వినాయక చవితి పూజల్లో భాగంగా లడ్డూ వేలం పాట జరిగింది. ఈ వేలంపాటలో పాల్గొన్న సాఫ్ల్ వేర్ ఇంజినీర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మికంగా మరణించడంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చనిపోయిన ముందు రోజు రాత్రి..  గణేష్ లడ్డూ వేలంపాటలో పాల్గొన్న శ్యామ్ ప్రసాద్.. వేలం పాటలో  రూ. 15 లక్షల వరకు పాడారు. ఆ తర్వాత లడ్డూను తన మిత్రుడు కైవస చేసుకున్నాడు.   

ఈ సందర్బంగా  .. గణేష్ మండపం వద్ద రాత్రంత తన బృంద సభ్యులతో కలిసి నృత్యాలతో ఎంజాయ్ చేసాడు శ్యామ్ ప్రసాద్.  ఆ తర్వాత తన ఇంటికి వెళ్లేసరికి హార్ట్ ఎటాక్ రావడంతో ఇంట్లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో శ్యామ్ ప్రసాద్ వాళ్ల కుటుంబంలో విషాదం నెలకొంది. ఆదివారం రాత్రి మణికొండ అల్కాపూరి టౌన్ షిఫ్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగిన‌ లడ్డు వేలం పాటలో చివరి వరకు పాల్గొన్నాడు శ్యామ్ ప్రసాద్. ఆ తర్వాత గణేష మండపం వద్ద చాలా సేపటి వరకు తన నృత్య గానాలతో అలరించారు. అంతేకాదు వేలంపాటలో లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్న స్నేహితుడితో కలిసి తీన్ మార్ స్టెప్పులతో అలరించాడు.

ఆ తర్వాత శ్యామ్ ప్రసాద్  ఇంట్లో వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించడంతో అప్పటి వరకు తమ ముందు ఆడుతూ పాడుతూ తిరిగిన వ్యక్తి తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో కాలనీలో అతని కుటుంబ సభ్యులు, మిత్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.  

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News