Former Indian batsman VVS Laxman may join BJP soon, waiting for final word from high command: భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆయన బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. ఇప్పటికే లక్ష్మణ్‌తో బీజేపీ జాతీయ నేతలు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. బీజేపీలో చేరేందుకు వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) సమక్షంలో లక్ష్మణ్ బీజేపీ కండువా కప్పుకోబోతున్నారని విశ్వసనీయ సమాచారం.భారత క్రికెట్ చరిత్రలో తనదైన స్పెషల్ పేజీలు లిఖించిన హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్.. త్వరలోనే పొలిటికల్ ఇన్నింగ్స్ (Political innings) ఆరంభించనున్నాడు.
Also Read : Unstoppable Promo:'వన్స్ ఐ స్టెప్ ఇన్..దెబ్బకు థింకింగ్ మారిపోవాలా'..అంటున్న బాలయ్య
ఇక లక్ష్మణ్ భారత జట్టుకు కీలకమైన విజయాలెన్నో అందించి, 2012లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. తర్వాత ఐపీఎల్ టోర్నీలో డెక్కన్ చార్జెస్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు. ప్రస్తుతం హైదరాబాద్ సన్ రైజర్స్ (Sunrisers Hyderabad) జట్టుకు మెంటర్ గా కొనసాగుతున్నాడు. ఆటగాడిగా రిటైరైన తర్వాత హైదరాబాద్ సిటీలోనే అకాడమీ స్థాపించిన లక్ష్మణ్ యువ క్రీడాకారులకు క్రికెట్ లో శిక్షణ ఇస్తున్నాడు. పలు స్వచ్ఛంద సంస్థలకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. వీవీఎస్ ఫౌండేషన్ (VVS Foundation) పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ తో సుదీర్ఘ అనుబంధమున్న లక్ష్మణ్ ను జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోనే ఒక నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలపాలని బీజేపీ భావిస్తోందట. ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) గనుక అసెంబ్లీకి (అంబర్ పేట నుంచి) పోటీ చేస్తే సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో లక్ష్మణ్ ను బరిలోకి దించాలని, అలా కాని పక్షంలో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచే వీవీఎస్ ను (VVS) నిలబెట్టాలని బీజేపీ (BJP) యోచిస్తున్నట్లు తెలుస్తోంది. లక్ష్మణ్ పొలిటికల్ ఇన్నింగ్స్ పై ఇప్పటిదాకా అధికారిక ప్రకటన అయితే రాలేదు.
Also Read : Khel Ratna Award: ఖేల్‌రత్న, అర్జున అవార్డులకు నామినేట్ అయ్యింది ఎవరెవరంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి