Former bhojadla Prabhakar suicide in Khammam cm revanth reacts: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా రచ్చగా మారాయి. ఇటీవల తెలంగాణలో ఒక రైతు ఆత్మహత్య ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలానికి చెందిన రైతు భోజడ్ల ప్రభాకర్ తన పొలంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ క్రమంలో కొన్నిరోజులుగా.. తన పొలంలోను కొందరు కబ్జా చేశారని కూడా ఆరోపణలు చేశాడు. రైతుకు చెందని మూడున్నర ఎకరాల పొలాన్ని.. స్థానికంగా ఉండే..కిశోర్, రామారావు , గుర్రం నాగమల్లేశ్వర రావు, మోగిలి శ్రీను, ముత్తయ్య లు కలసి కబ్జాకు పాల్పడ్డారని రైతు కన్నీళ్లు పెట్టుకున్నాడు. వీరంతా డిప్యూటీ సీఎం మల్లు భట్టీ విక్రమార్కకు చెందిన వారని కూడా రైతు ఆరోపణలుచేశాడు. దీనిపై పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఎంత చెప్పిన కూడా పట్టించుకోలేదని రైతుఆవేదన వ్యక్తం చేశాడు.
Read more: Snake Viral Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..
స్థానికంగా ఉండే పెద్ద మనుషుల సైతం.. తనకు జరిగిన అన్యాయం చెబితే పట్టించుకోలేదని రైతు కన్నీళ్లు పెట్టుకున్నాడు. కలెక్టర్ ఆఫీస్ లో కూడా చెప్పుకున్న కూడా తనకు న్యాయం జరగలేదని రైతు వాపోయాడు.ఈ క్రమంలోనే నిన్న తన పొలంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో హట్ టాపిక్ గా మారింది. దీనిపై అపోసిషన్ నేతలు కాంగ్రెస్ అధికారంలో ఉండి,రైతులకు అన్యాయం చేస్తుందంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు.
దీనిపైన ఖమ్మం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, సీఎం రేవంత్ రెడ్డి సైతం సీరియస్ అయ్యారు. వెంటనే రైతు భూ ఆక్రమణపై సమగ్ర దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించారు. మరోవైపు రైతు చనిపోయే ముందు డిప్యూటీ సీఎం అనుచరులు పేర్లు చెప్పిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై చనిపోయిన రైతు కుటుంబంకు పోలీసులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. రైతు చెప్పిన వారి పేర్లను ఫిర్యాదులో రాస్తే.. పొలీసులు తీసుకొవట్లేదని కూడా ఆరోపణలు వస్తున్నాయి.
Read more: Snake bite: ఇదేం విడ్డూరం.. నెల వ్యవధిలో 5 సార్లు కాటేసిన పాము.. స్టోరీ తెలిస్తే షాక్ అవుతారు..
బైట రాజకీయాలు ఒకలా. పీఎస్ లో మరో విధంగా బాధితులను ఒత్తడికి గురిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో కొందరు కావాలనే డిప్యూటీ సీఎంను బ్లేమ్ చేయడానికి ఈ విధంగా రైతుతో ఆరోపణలు చేయించారని కూడా టాక్ నడుస్తోంది. డిప్యూటీ సీఎం పదవి ఎసరు పెట్టడానికి,కొందరు ప్లాన్ ప్రకారమే రైతు సూసైడ్ చేసుకునేలా పావులు కదిపారని కూడా ప్రచారం జరుగుతుంది . ఈ ఘటన పై మాత్రం రాజకీయాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి