Bharat Gaurav train: తెలుగు రాష్ట్రాల నుంచి 'తొలి భారత్ గౌరవ్ రైలు' ప్రారంభం

Bharat Gaurav train: తెలుగు రాష్ట్రాల నుంచి తొలి భారత్ గౌరవ్ రైలు శనివారం సిక్రింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమైంది. ఈ ట్రైన్ ను దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ జెండా ఊపి ప్రారంభించారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 19, 2023, 11:38 AM IST
Bharat Gaurav train: తెలుగు రాష్ట్రాల నుంచి 'తొలి భారత్ గౌరవ్ రైలు' ప్రారంభం

First Bharat Gaurav train from Telugu states: దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించేందుకు ప్రవేశపెట్టిన భారత్ గౌరవ్ రైలు శనివారం సిక్రింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల నుంచి బయలుదేరిన తొలి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ఇదే. ఇందులో ప్రయాణించే యాత్రికులకు స్వాగత కిట్‌లు అందజేశారు. అంతేకాకుండా టూరిస్ట్ లను అలరించేందుకు కూచిపూడి నృత్యాలు కూడా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఐఆర్‌సీటీసీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రజనీ హసిజా, SCR జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఇతర రైల్వే అధికారులు పాల్గొన్నారు. 

నిన్న మెుదలైన ఈ యాత్ర మార్చి 26 వరకు కొనసాగుతుంది. మెుత్తంగా  8 రాత్రులు, 9 పగళ్లు ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ పర్యటనలో పూరి, కోణార్క్, గయా, వారణాసి, అయోధ్య మరియు ప్రయాగ్‌రాజ్‌లోని ముఖ్యమైన మరియు చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి ఈ యాత్ర ఉపయోగపడుతుందని  అరుణ్‌కుమార్‌ జైన్‌ అన్నారు. 

దీనిని పుణ్యక్షేత్ర యాత్ర పేరిట నిర్వహిస్తున్నారు. ఈ పూరి - కాశి - అయోధ్య రైలును ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నిర్వహిస్తోంది. ఈ రైలులో ఏసీ కోచ్ లతోపాటు నాన్ ఏసీ కోచ్ లు కూడా ఉన్నాయి. యాత్రికులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అందిస్తారు. ఈ రైలులో ప్రయాణించే యాత్రికుల సొకర్యార్థం అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు.  ఈ టూర్ కు రూ.15,000 నుండి రూ. .30,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. 

Also Read: Swapnalok Complex Fire Accident: స్వప్నలోక్ కాంప్లెక్స్‌ అగ్ని ప్రమాదం ఘటనలో ఐదుగురు మృతి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News