Fire Breaks Out: వేసవికాలం ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు తీవ్రమవుతుండడంతో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఒక వ్యవసాయ గోదాములో ప్రమాదం సంభవించి కోట్ల విలువైన ఆహార పదార్థాలు కాలి బూడదయ్యాయి. ఒక్కసారిగా ఎగిసిన మంటలతో ఆహార ధాన్యాలను కాపాడలేకపోయారు. ఈ సంఘటన తెలంగాణలోని పెబ్బేరులో చోటుచేసుకుంది.
Also Read: CSK Fan Died: ఐపీఎల్‌లో విషాదం.. రోహిత్ శర్మ ఔట్‌పై వివాదం.. సీఎస్కే అభిమాని మృతి
వనపర్తి జిల్లా పెబ్బేరులో ఉన్న వ్యవసాయ గోదాములో సోమవారం మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో గోదాములో మంటలు చెలరేగి అంతటా వ్యాపించాయి. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు, సిబ్బంది ఆందోళన చెందారు. వెంటనే మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read: Ramdas Nayak: 'బట్టలు విప్పదీసి కొడుతా' బూతులతో రెచ్చిపోయిన వైరా కాంగ్రెస్ ఎమ్మెల్యే
మంటలను నియంత్రణలోకి తీసుకురావడానికి అగ్నిమాపక, పోలీస్ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే గోదాములో దాదాపుగా 10 కోట్ల విలువైన వరి ధాన్యం, గన్ని బ్యాగులు ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మంటలు చెలరేగడానికి కారణం ఇంకా తెలియలేదు. షార్ట్ సర్క్యూటా.. లేదా ఇంకేదైనా ప్రమాదమా అనేది ఇంకా తెలియలేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook