Big debate with Bharath: ఈటల రాజేందర్‌కి సీఎం కేసీఆర్‌తో అక్కడే చెడిందా ? ఈటలతో ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ

Eatala Rajender Exclusive Interview in Big debate with Bharath: ఈటల రాజేందర్... మాజీ మంత్రిగా, అంతకంటే ముందుగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ పార్టీ తరపున చురుకుగా ఉద్యమించిన ఒక ఉద్యమకారుడిగా జగమెరిగిన నాయకుడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 26, 2022, 09:31 PM IST
  • తెలంగాణకు సీఎం అయ్యేందుకే ఈటల రాజేందర్ బీజేపిలో చేరారా ?
  • సీఎం కేసీఆర్‌తో ఈటల రాజేందర్‌కి అందుకే చెడిందా ?
  • బిగ్ డిబేట్ విత్ భరత్' షోలో ఈటల రాజేందర్ వెల్లడించిన అనేక ఆసక్తికరమైన విషయాలు ఇదిగో..
Big debate with Bharath: ఈటల రాజేందర్‌కి సీఎం కేసీఆర్‌తో అక్కడే చెడిందా ? ఈటలతో ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ

Eatala Rajender Exclusive Interview in Big debate with Bharath: ఈటల రాజేందర్... మాజీ మంత్రిగా, అంతకంటే ముందుగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ పార్టీ తరపున చురుకుగా ఉద్యమించిన ఒక ఉద్యమకారుడిగా జగమెరిగిన నాయకుడు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కేబినెట్‌లో కీలక నేతగా ఎదిగిన బీసీ నాయకుడు... తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు అత్యంత సన్నిహితుడిగా, అన్ని వేళల్లో అందుబాటులో ఉండే పేరొందిన అగ్రనేతల్లో ముందు వరుసలో ఉండే వారు. కానీ అదంతా ఒకప్పుడు.. ఎక్కడ చెడిందో ఏమో కానీ ఒక్కసారిగా సీన్ మారిపోయింది. కేసీఆర్‌కి దగ్గరిగా ఉండే వారిలో ముఖ్యుడైన ఈటల రాజేందర్‌కి ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కూడా లేని దుస్థితి. కలుద్దామని ప్రగతి భవన్‌కి వెళ్తే.. అక్కడ కూడా నో ఎంట్రీ..! ఆ తర్వాత ఎవ్వరూ ఊహించని పరిణామాలు ఈటల రాజేందర్ పార్టీని వీడి బీజేపిలో చేరేలా చేశాయి... ఆ పార్టీ నుంచే నువ్వా నేనా అన్నట్టు హోరాహోరీగా జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టారు.  

ఇదంతా ఇప్పటివరకు అందరికీ తెలిసిన విషయాలు.. మరి తెలియని విషయాలు ఏంటి ? తెలంగాణకు సీఎం అయ్యేందుకే ఈటల రాజేందర్ బీజేపిలో చేరారా అంటే ఆయన ఏం చెబుతారు ? సీఎం కేసీఆర్ నుంచి ఆయన ఎలాంటి పాఠాలు నేర్చుకున్నారు ? తనపై వచ్చే సంచలన ఆరోపణలకు, సవాలక్ష యక్ష ప్రశ్నలకు ఈటల రాజేందర్ ఏం సమాధానం చెబుతారు ? జీ తెలుగు న్యూస్ ఎడిటర్ భరత్‌కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ 'బిగ్ డిబేట్ విత్ భరత్' షోలో ఈటల రాజేందర్ (Eatala Rajender) వెల్లడించిన అనేక ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ఇదిగో ఈ వీడియో చూడాల్సిందే.

Also read : Kishan reddy on TS Govt: 'ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై విమర్శలు తగవు'

Also read : KCR Datti Controversy: దట్టి ధరించి ఆలయాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్.. పలువురు ఆగ్రహం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News