Eetela Rajender: ఈటల రాజేందర్‌కు ఊరట.. మెదక్ కలెక్టర్ రిపోర్టును తప్పుపట్టిన High court

Telangana high court slams Medak collector in Eetela Rajender issue: హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కి తెలంగాణ హై కోర్టులో ఊరట లభించింది.  మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేటలోని ఈటల రాజేందర్ భూములపై మే 1, 2వ తేదీల్లో జరిగిన విచారణ చట్టబద్దంగా లేదని, ఈ విషయంలో మెదక్ జిల్లా కలెక్టర్ రిపోర్టును పరిగణలోకి తీసుకోవద్దని తెలంగాణ హై కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 4, 2021, 07:54 PM IST
Eetela Rajender: ఈటల రాజేందర్‌కు ఊరట.. మెదక్ కలెక్టర్ రిపోర్టును తప్పుపట్టిన High court

Telangana high court slams Medak collector in Eetela Rajender issue: హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కి తెలంగాణ హై కోర్టులో ఊరట లభించింది.  మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేటలోని ఈటల రాజేందర్ భూములపై మే 1, 2వ తేదీల్లో జరిగిన విచారణ చట్టబద్దంగా లేదని, ఈ విషయంలో మెదక్ జిల్లా కలెక్టర్ రిపోర్టును పరిగణలోకి తీసుకోవద్దని తెలంగాణ హై కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకవేళ ఈటల రాజేందర్ అవినీతికి పాల్పడినట్టు భావిస్తే.. సరైన పద్దతిలో నోటీసులు ఇచ్చి విచారణ జరిపించాలి. కానీ ఈటల రాజేందర్ భూముల సర్వే (Eetela Rajender's land survey) విషయంలో నోటీసులు ఇవ్వకుండానే విచారణ ముగించి నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని కోర్టు ప్రశ్నించింది. ఇది అధికార ఉల్లంఘన కిందకే వస్తుందని హై కోర్టు అభిప్రాయపడింది. అధికారుల తీరు చూస్తోంటే, కారులో కూర్చుని నివేదికలు రూపొందించినట్టు కనిపిస్తోందని హై కోర్టు వ్యాఖ్యానించింది.
 
పద్ధతి ప్రకారం అధికారికంగా నోటీసులు జారీ చేసి విచారణ జరిపించి, వారి వివరణ తీసుకోవాలని హై కోర్టు సర్కారుకు హితవు పలికింది. తమ భూముల్లోకి అధికారులు అక్రమంగా చొరబడి, తమకు నోటీసులు ఇవ్వకుండానే విచారణ చేపట్టి, రాత్రికి రాత్రే విచారణ ముగించడమే కాకుండా ఆ నివేదిక సైతం తమకు ఇవ్వలేదనే అంశాలను హై కోర్టు దృష్టికి తీసుకొస్తూ ఈటల రాజేందర్ కుటుంబం (Eetela Rajender's family) దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌పై విచారణ సందర్భంగా హై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 

Also read : Eetela Rajender: కాన్వాయ్, సెక్యురిటీ సిబ్బందిని వెనక్కి పంపించిన ఈటెల రాజేందర్

ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జూలై 6వ తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ప్రసాద్ వాదనలు వినిపించగా, ఈటల రాజేందర్ కుటుంబం (Eetela Rajender) తరపున దేశాయి ప్రకాశ్ రెడ్డి (Eetela Rajender's Advocate Deshai Prakash Reddy) వాదనలు వినిపించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News