Cheruku Srinivas Reddy joins congress ahead of Dubbaka by election: హైదరాబాద్: దుబ్బాక ఉపఎన్నిక సమీపిస్తున్న తరుణంలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీ దివంగత నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో దుబ్బాక నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించిన దుబ్బాక ముత్యంరెడ్డి కుటుంబానికి ఆ నియోజకవర్గంలో ఇప్పటికీ పట్టు ఉండటంతో శ్రీనివాస్ రెడ్డి చేరిక తమ పార్టీకి కలిసొచ్చే అంశం అవుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో సోలిపేట రామలింగా రెడ్డిని ( Solipeta Ramalinga Reddy ) ఓడించిన కాంగ్రెస్ నేతగా చెరుకు ముత్యంరెడ్డికి పేరుంది. ఇటీవలే ఆయన చనిపోయినప్పటికీ.. ఆ ప్రాంతంలో ఆయన కుటుంబానికి ఇప్పటికీ పట్టు ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ కారణం వల్లే టీఆర్ఎస్ పార్టీ తరపున దుబ్బాక ఉప ఎన్నిక టికెట్ ఆశించిన వారిలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. ఐతే, టీఆర్ఎస్ పార్టీ మాత్రం మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత సోలిపేట రామలింగా రెడ్డి భార్య సుజాతకే ( Dubbaka bypoll TRS candidate Solipeta Sujatha ) టికెట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. దీంతో తిరుగుబాటు జండా ఎగరేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుత టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకి ఈ పరిణామం ప్రతికూలంగా మారినా ఆశ్చర్యపోనక్లర్లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మంగళవారం గాంధీ భవన్లో చెరుకు శ్రీనివాస రెడ్డి మెడలో పార్టీ కండువా వేసి టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ( TPCC Chief Uttam Kumar Reddy ) ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Also read : River water disputes : ఏపీలోని ప్రాజెక్టులు ఆపకుంటే.. తెలంగాణలో బాబ్లీ తరహా ప్రాజెక్ట్: సీఎం కేసీఆర్
ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక ఉపఎన్నిక ( Dubbaka bypoll ) అంటే కేవలం ఆ నియోజకవర్గానికి అభ్యర్థిని ఎన్నుకోవడం మాత్రమే కాదనీ.. అందులో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ దాగి ఉందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ కుటుంబం ( CM KCR family ) వందల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించిన ఉత్తమ్.. రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ ఒక వ్యాపారంగా మార్చేశారని విమర్శించారు. ఆ తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికల్లో డబ్బు, మద్యం ఏరులై పారించారని.. అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా కల్వకుంట్ల కుటుంబానికి తగిన గుణపాఠం చెప్పాలని దుబ్బాక ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. Also read : TSPSC: గ్రూప్ 4 ఫలితాలు విడుదల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe