disabled food delivery boy video goes viral: కొంత మంది తమకు ఎంత ఉన్న దాని విలువ పట్టనట్టు ఉంటారు. కానీ దీనికి భిన్నంగా మరికొందరు ఎంతో కష్టపడుతుంటారు. తమ తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు ఇవ్వలేదని, చదివించలేదని కొంత మంది ప్రతిదానికి ఏడుస్తుంటారు. కొత్త పనిచేసేందుకు అస్సలు ఇంట్రెస్ట్ చూపెట్టరు. నేర్చుకొవాలనే తపన, సాధించాలనే సంకల్పం ఉన్నవారు మాత్రం..దీనికి భిన్నంగా ఉంటారు. ఏదైన చేసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.
కష్టం ప్రతి ఒక్కరికి వస్తుంది కష్టంలో నుంచి బయటపడిన వాళ్లే గొప్పవారు.. కష్టం నుండే బాధ తెలిసింది. అప్పుడే మనిషికి ఎలాంటి లోపం ఉన్న బతుకు సాగించాలి అంతే.నీ పట్టుదలకు హ్యాట్సాఫ్👏🤝 pic.twitter.com/hIeXKAhr4y
— Vikram mudhiraj (@vikram_TRS) November 18, 2024
ఈ క్రమంలో.. మనం తరచుగా మన చుట్టు ఉన్న వారు.. కొందరు దివ్యాంగులైన కూడా ఏదో ఒకటి చేస్తుంటారు. కాళ్లు చేతులున్న వారు.. కూడా చేయలేని పనులు చేస్తు అందరికి ఆదర్శంగా ఉంటారు. ఈ నేపథ్యంలో ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మళ్లీ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ గతంలో చేసిన వ్యాఖ్యలకు మళ్లీ కౌంటర్ గా ఈ వీడియోను షేర్ చేసి కామెంట్లు చేస్తున్నారు.
పూర్తి వివరాలు..
ఒక దివ్యాంగుడు.. కాళ్లు లేకున్న..టీవీఎస్ స్కూటీ ఎక్కి మరీ ట్రాఫిక్ లో ఫుడ్ డెలీవరీ చేస్తున్నాడు. అసలు ట్రాఫిక్ లో కాళ్లు చేతులు బాగున్న వాళ్లకే ట్రాఫిక్ లో వాహానం నడిపించడం రిస్క్ తో కూడుకున్న పనిగా చెప్పవచ్చు. కానీ ఇతను మాత్రం.. కాళ్లు లేకున్న కూడా.. ఎంతో కష్టపడి.. లూనా మీద ఫుడ్ డెలీ వరీ చేస్తున్నాడు. చేతిలో ఒక కర్రను కూడా పెట్టుకున్నాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం ఫిదా అవుతున్నారు.
లూనా నడుపుతున్న దివ్యాంగ ఫుడ్ డెలీబాయ్ కు హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత మంది నెటిజన్లు గతంలో స్మిత సబర్వాల్ చేసిన వ్యాఖ్యల్ని మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు.
గతంలో డైనమిక్ అధికారిణి.. దివ్యాంగులకు సివిల్ సర్వీసెస్ లో రిజర్వేషన్ లు అవసరమా అంటూ ఆమె పొస్ట్ పెట్టారు. ఇది పెద్ద దుమారంగా మారిన విషయం తెలిసిందే. పట్టుదల ఉంటే.. ఏదైన సాధ్యమని..దీనికి దివ్యాంగులు చేయలేనిదీ ఏది ఉండదని కూడా నెటిజన్లు స్మితకు గట్టిగానే కౌంటర్ లు వేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.