New Medicine for Covid: కరోనాకు కొత్త మందు, హైదరాబాద్ కంపెనీకు క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి

New Medicine for Covid: కరోనాకు సరికొత్త చికిత్స అందుబాటులో రానుంది. హైదరాబాద్ కంపెనీ, సీసీఎంబీ, సెంట్రల్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన మందు క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతిచ్చింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 28, 2021, 08:38 PM IST
New Medicine for Covid: కరోనాకు కొత్త మందు, హైదరాబాద్ కంపెనీకు క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి

New Medicine for Covid: కరోనాకు సరికొత్త చికిత్స అందుబాటులో రానుంది. హైదరాబాద్ కంపెనీ, సీసీఎంబీ, సెంట్రల్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన మందు క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతిచ్చింది.

కరోనా మహమ్మారికి (Corona Virus) విరుగుడుగా మరో మందు రాబోతుంది.హైదరాబాద్‌కు చెందిన విన్ బయో‌ప్రొడక్ట్స్ లిమిటెడ్( Vin Bioproducts ltd), హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ( HCU), సీసీఎంబీ (CCMB)సంయుక్తంగా ఈ సరికొత్త మందు విన్‌కోవ్ 19(Wincov-19)ను అబివృద్ధి చేశాయి.కరోనాకు ఓ విధమైన చికిత్సా విధానంగా పరిశోధకులు చెబుతున్న ఈ మందుపై ఇండియాలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు డీసీజీఐ(DCGI) అనుమతులిచ్చింది. దేశవ్యాప్తంగా 3 వందల మంది కరోనా రోగులపై కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం విన్‌కోవ్ 19 ప్రయోగించి..సామర్ధ్యాన్ని పరిశీలించనున్నారు.

యాక్టివ్‌గా లేని సార్స్ సీవోవీ-2 కరోనా వైరస్ కొమ్ము ప్రొటీన్లను గుర్రాల రక్తం ( Horse Blood)లో ఎక్కించడం ద్వారా యాంటీబాడీలు ( Anti Bodies) ఉత్పత్తి చేశారు పరిశోధకులు. తరువాత గుర్రం రక్తంలోని సీరమ్ బయటకు తీసి విన్‌కోవ్ 19(Wincov-19) మందును తయారు చేశారు. ఈ మందును కరోనా రోగులకు ఎక్కిస్తే వైరస్‌ను చంపేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. కోవిడ్ వైరస్ సోకిన తరువాత ఆ వైరస్ మనిషి ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకుపోకుండా ఉండేందుకు యాంటీబాడీలు దోహదపడతాయని పరిశోధకులు చెబుతున్నారు.కరోనా వైరస్ సోకిన తరువాత సాధ్యమైనంత త్వరగా విన్‌కోవ్ 19 ఇస్తే..వైరస్ ఇన్‌ఫెక్షన్ తగ్గిస్తుందని అంచనా. విన్‌కోవ్ 19 తయారీకు హెచ్ సీయూ, సీసీఎంబీ, విన్స్ సంస్థల మధ్య 2020 మేలో ఒప్పందమైంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్‌(Clinical Trials)కు అనుమతి లభించిన నేపధ్యంలో విజయవంతంగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సాధ్యమైనంత త్వరలో క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసి మార్కెట్‌లోకి విన్‌కోవ్ 19 ను ప్రవేశపెట్టాలనేది కంపెనీ ఆలోచనగా ఉంది. 

Also read: Telangana COVID-19 Updates: ఒక్కరోజులో 56 కరోనా మరణాలు, నైట్ కర్ఫూలో పెరిగిన కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News