Cyberabad Police: మరణించిన ఎస్సైకి పోస్టింగ్.. పోలీసులు వింత ఉత్తర్వులు

SI Transfers In Telangana: సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఎస్సైల బదిలీలు చర్చనీయాంశమైంది. మరణించిన దుండిగల్‌ ఎస్సై బి.ప్రభాకర్‌ రెడ్డి పేరు కూడా టాన్సఫర్ ఆర్డర్స్‌లో ఉండడం విస్మయానికి గురిచేస్తోంది. పొరపాటును గుర్తించిన అధికారులు మార్పులు చేసి ఉత్తర్వులు జారీ చేశారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 14, 2023, 09:31 AM IST
Cyberabad Police: మరణించిన ఎస్సైకి పోస్టింగ్.. పోలీసులు వింత ఉత్తర్వులు

SI Transfers In Telangana: సైబరాబాద్‌ పోలీసులు వింత ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల గుండెపోటుతో మరణించిన దుండిగల్‌ ఎస్సై బి.ప్రభాకర్‌ రెడ్డిని బదిలీ చేయడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పొరపాటును గుర్తించిన అధికారులు మరణించిన ఎస్సై పేరు తొలగించి కొత్త ఆదేశాలిచినట్లు సమాచారం. వివరాలు ఇలా.. ఎస్సై ప్రభాకర్‌రెడ్డి జూన్‌ 9న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. కాగా.. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఎస్సైలను బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో ఎస్సై ప్రభాకర్‌రెడ్డి పేరు కూడా ఉంది. 

మరణించిన ఎస్సై పేరు బదిలీ ఉత్తర్వుల జాబితాలో ఉండడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఈ ఉత్తర్వులు పోలీసులకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్‌ల్లో చక్కర్లు కొట్టినట్లు తెలుస్తోంది. వెంటనే జరిగిన పొరపాటును గుర్తించిన అధికారులు వెంటనే ఎస్సై ప్రభాకర్‌రెడ్డి పేరు తొలగించి కొత్త జాబితా విడుదల చేశారు. 'ఎస్సైల బదిలీలకు సంబంధించిన ప్రతిపాదన జాబితా గతంలోనే సిద్ధమైంది. అప్పటికి ప్రభాకర్‌రెడ్డి విధుల్లోనే ఉన్నారు. సాంకేతిక పొరపాటుతో అవే పేర్లతో ఆదేశాలు వెలువడ్డాయి. వెంటనే అప్రమత్తమై కొత్త జాబితా ఇచ్చాం.' అని సైబరాబాద్‌ కమిషనరేట్‌ ఉన్నతాధికారి ఒకరు వివరణ ఇచ్చారు.

మూడు కమిషనరేట్లలో బదిలీలు

హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో 13 మంది ఏసీపీలను బదిలీ చేస్తూ డీజీపీ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న వారికి ఇక్కడ బాధ్యతలు అప్పగించారు. మరికొందరికి ఇతర జిల్లాల్లో పోస్టింగ్‌ ఇచ్చారు. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించిన వారిని త్వరలోనే ఇతర ప్రాంతాల్లో నియమించనున్నారు. మరికొందరు ఏసీపీల బదిలీలున్నాయని అధికారులు తెలిపారు. సైబరాబాద్‌లో 82 మంది ఎస్సైలు.. సైబరాబాద్‌లో 82 మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఉత్తర్వులకు అనుగుణంగా ఎస్‌హెచ్‌వోలు రిలీవ్‌, డ్యూటీ రిపోర్టుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Also Read: సెంచరీలతో కదం తొక్కిన యశస్వి, రోహిత్.. భారీ ఆధిక్యం దిశగా టీమిండియా..

Also Read: Eluru News: కన్నతల్లి కసాయి బుద్ది.. సొంత కుమార్తెలను రెండో భర్తకు అప్పగించిన మహిళ  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News