మహాకూటమిలో కొనసాగడంపై సీపీఐ రాష్ట్ర కార్యరద్శి చాడా వెంకట్‌రెడ్డి స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహాకూటమి ఏర్పాటులో సీపీఐ పార్టీ చాలా కీలక పాత్ర పొషించిందన్నారు. తాము ఇప్పటికీ కూటమిలో స్థిరత్వం కోరుకుంటున్నామని .. మిత్ర పక్షాలకు గౌరవం ఇవ్వాలనేదే మా ప్రధాన డిమాండ్ అని చాడా పేర్కొన్నారు.
పొత్తులో భాగంగా తాము 9 స్థానాల నుంచి ఐదు స్థానాలకు దిగి వచ్చాము. కాంగ్రెస్ పార్టీ మూడు ఎమ్మెల్యే, రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తానంటోంది. నాలుగు ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ కేటాయించాలని కాంగ్రెస్ ను కోరాం. ఇప్పటి వరకు కాంగ్రెస నుంచి ఎలాంటి స్పందన లేదు. కాంగ్రెస్ రియక్షన్ బట్టి తాము భవిష్యత్తు కార్యచరణ ప్రటిస్తామని చాడా వెంకట్ రెడ్డి వెల్లడించారు.
మహాకూటమి సీట్ల సర్దుబాటు విషయంలో టీజేఎస్, సీపీఐ పార్టీలు అలిగిన విషయం తెలిసిందే. ఒకవైపు అభ్యర్ధులను ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరించడం..మరోవైపు సీపీఐ నేతలతో టీజేఎస్ చీఫ్ కోదండారం భేటీ అవడంతో పలు రకాల ఊహాగానాలు వినిపించాయి. ఈ రెండు పార్టీలు కూటమి నుంచి వైదొలిగి..కొత్తగా కూటమిగా ఏర్పడతాయని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి ఈ మేరకు స్పందించారు. చాడా రియక్షన్ బట్టి చూస్తే ఆయన మహాకూటమిలోనే కొనసాగాలనే ఉద్దేశంతో ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.